బౌద్ధంపై చక్కటి కథాసంకలనం
సత్‌గ్రంథం
బుద్ధుడు చెప్పినట్లుగా మహాయానంలో ప్రచారంలో ఉన్న కథలకే జాతక కథలని పేరు. ఈ కథలు 430 అని కొందరూ, 547 అని మరికొందరూ చెబుతారు. హిందూమతం బుద్ధిః కర్మానుసారిణి అంటే, కర్మ బుద్ధ్యానుసారిణి అంటుంది బౌద్ధం. బౌద్థంపై అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడి,్డ బొర్రా గోవర్ధన్ వంటివారు ఎన్నో మంచి రచనలు చేశారు. తాజాగా కవి, పరిశోధకుడు, తాళపత్ర గ్రంథ సేకర్త డా. కావూరి శ్రీనివాస్ ‘జాతక కథలు’ పేరిట పుస్తకాన్ని ప్రచురించారు. 41 కథలు ఉన్న ఈ పుస్తకంలో కథలతోపాటు, సంబంధిత నిజచిత్రాలూ ఉండటం విశేషం. చిన్న కథలైనా, చక్కటి నీతిని చెబుతాయి. వీటిని వాడుకభాషలో రాసి ఉంటే బాగుండేది.
జాతక కథలు; సేకరణ, రచన: డా. కావూరి శ్రీనివాస్; పుటలు: 92; వెల రూ. 100 ప్రతులకు: తెలంగాణ రాష్ర్ట పర్యాటకాభివృద్ధి సంస్థ, టూరిజం హౌస్, 3-5-891, హిమాయత్ నగర్, హైదరాబాద్- 500 029; ఫోన్: 9849776157
- డి.వి.ఆర్.