
ఆలయాన్ని దర్శించే భక్తులు ఆలయవ్యవస్థ గురించి తెలుసుకోవడం కనీసధర్మం. అందులో ముందుగా.. ఆలయాన్ని నిర్మించే శిల్పులు, స్థపతుల గురించి తెలుసుకోవాలి. వీరి తోడ్పాటు లేనిదే ఆలయనిర్మాణం అసాధ్యం. విశ్వకర్మ సంప్రదాయ పరంపరలోని వీరు శాస్త్రం, సంప్రదాయం అనుసరించి ఆలయం నిర్మించి.. అందులో విగ్రహం స్థాపిస్తారు. అందుకే వారిని స్థపతి అంటారు. శిల్పాచార్యులనే పేరుతో కూడా వీరు ప్రసిద్ధులు. భక్తుడు ఆలయానికి చేసే ఒక ప్రదక్షిణ ఫలం శిల్పాచార్యుడికి చేరుతుందని మయుడు చెప్పాడు. ఆలయనిర్మాణం.. ప్రతిష్ఠ జరిగాక ఆలయాభివృద్ధికి తోడ్పడేవారిలో అర్చకులు ముందుంటారు. లోకహితం కోరి అర్చనాది కైంకర్యాలు జరుపుతూ అర్చకుడే దేవుడి ప్రతినిధి అని.. ప్రజలతో మన్ననలందుకునే అర్చకవ్యవస్థను.. అర్చకులను గౌరవించడం భక్తుల విధి. ఇంకా వేదపారాయణదారులు.. శాస్త్రవిద్వాంసులు.. స్థానాచార్యులు... జ్యోతిష విద్వాంసులు.. గాయకులు.. నృత్యకారులు.. వాద్యకారులు...వైద్యులు..అలంకారికులు.. పరిచారకులు మొదలైన ఎందరో ఆలయవ్యవస్థలో భాగస్వామ్యులు.
– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమ, శిల్పశాస్త్ర పండితులు, ఆగమ, శిల్పశాస్త్ర పండితులు
Comments
Please login to add a commentAdd a comment