ఎమోటివ్ ఇన్‌సైట్ బ్రెయిన్ రీడర్... వచ్చేస్తోందహో! | Emotiv Insight Brain Reader comming soon | Sakshi
Sakshi News home page

ఎమోటివ్ ఇన్‌సైట్ బ్రెయిన్ రీడర్... వచ్చేస్తోందహో!

Published Fri, Sep 13 2013 11:17 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

ఎమోటివ్ ఇన్‌సైట్ బ్రెయిన్ రీడర్... వచ్చేస్తోందహో! - Sakshi

ఎమోటివ్ ఇన్‌సైట్ బ్రెయిన్ రీడర్... వచ్చేస్తోందహో!

యావత్ ప్రపంచంలో నిద్ర అనేదే ఎరుగక, నిరంతరం పనిచేసేవి రెండు. ఒకటి గుండె, ఇంకొకటి మెదడు. ఒకటి రక్తాన్ని ప్రసరింపచేస్తే, ఇంకొకటి ఆలోచనలను ప్రవహింపచేస్తుంది. అందులోనూ మెదడు చేసే పని చాలా కష్టమైనది. క్షణక్షణం ఆలోచిస్తుంది. మనిషి ఆలోచించని క్షణమంటూ లేదు. అనుక్షణం ఏదో ఒకటి ఆలోచించాలి. కానీ ఇన్నేళ్లలో, మన మెదడు మనలని అర్థం చేసుకున్నంతగా మనం మన మెదడుని అర్థం చేసుకోలేదు. కానీ ఈ మాటలు కొద్ది రోజుల్లో అంతరించిపోనున్నాయి. మన మెదడుని చదివి, మనకి అర్థమయ్యేలా దాన్ని క్రోడీకరించే గాడ్జెట్ మార్కెట్‌లోకి రాబోతోంది. అదే... ‘ఎమోటివ్ ఇన్‌సైట్’.
 
 ఏంటి ఈ ఎమోటివ్ ఇన్‌సైట్ గాడ్జెట్?


 ఒక ఆలోచన అంటే కొన్ని న్యూరాన్ల మధ్య రసాయనిక చర్యే... ఇలా న్యూరాన్ల మధ్య చర్య జరిగినప్పుడు కొత్త విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.  ఈ చర్యనే న్యూరల్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ అంటారు. ఈ ఇంపల్స్ వల్ల మెదడులో కొన్ని వేవ్స్ ప్రసరిస్తాయి. వాటిని బ్రెయిన్ వేవ్స్ అంటారు. మన హాస్పిటల్ లాబ్స్‌లో ఈఈజీ స్కానింగ్ మొదలైనవి ఈ బ్రెయిన్ వేవ్స్‌ని అధ్యయనం చేస్తూ విశ్లేషిస్తున్నారు. అలాంటిది ఈ మోటివ్ ఇన్‌సైట్ కూడా. చూడటానికి హెడ్‌సెట్‌లా ఉండే ఈ డివైజ్‌ని మనము ధరించగానే  అధ్యయనాన్ని మొదలుపెడుతుంది. వాటిని సెన్సార్స్ దగ్గర గ్రహిస్తుంది.  మనకి అర్థమయ్యేలా డీకోడ్ చేస్తుంది.
 
 డీకోడ్ చేశాక?

 
 మన ఆలోచనలని బట్టి బ్రెయిన్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మన మెదడు స్థితి (స్టేట్ ఆఫ్ మైండ్) వివరాలని మన మొబైల్‌కి గానీ పీసీకి గానీ పంపిస్తుంది. ఆ వివరాలని రిసీవ్ చేసుకోవడానికి గానూ ఫోన్లో ఈ మోటివ్ ఇన్‌సైట్ ఆప్‌ని ఆండ్రాయిడ్ జీౌట ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
 మూడ్ సెట్టింగ్
 
 ఈ డివైజ్‌ని పట్టుకున్నంత సేపు మన మెదడుని అధ్యయనం చేస్తూనే ఉంటుంది. భయం, బాధ, టెన్షన్, ఆనందం... ఇలా రోజూ మనకు కలిగిన భావాలన్నీ ఒక రిపోర్ట్‌లా మార్చి మన స్మార్ట్‌ఫోన్‌కి ఇన్‌ఫర్మేషన్ పంపిస్తుంది. దాంతో మన మెదడుని యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాదు... ఒకవేళ మనం బాధపడుతున్నా, ఆందోళనలో ఉన్నా, ఆ ఇన్‌ఫర్మేషన్‌ని మన హెడ్‌సెట్ ఫోన్‌కి బ్లూటూత్ ద్వారా ఇన్‌ఫర్మేషన్ పంపుతుంది. ఆ స్మార్ట్‌ఫోన్ ఆ మూడ్‌కి తగ్గట్టు మనల్ని కూల్ చేస్తే మ్యూజిక్ ప్లే చేస్తుంది. థెర్మాస్టార్ట్, ఎ.సి. టెంపరేచర్‌ని కూడా దానికి తగ్గట్టుగా మారుస్తుంది.
 
 ఈ బ్రెయిన్ రీడర్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ పేరు ‘తాన్ లీ’. వియత్నాంకి చెందిన లీ, తన చిన్నతనంలోనే ఆస్ట్రేలియా వలస వెళ్లింది. బ్రెయిన్ సైన్స్ మీద ఆసక్తితో ఎమోటివ్ అనే కంపెనీ ద్వారా నామ్ దో, నీల్ వెస్ట్, అలెన్ స్నైడర్‌లతో కలిసి బ్రెయిన్ రీడింగ్ డివైజ్ తయారీ ప్రారంభించింది. 1998లో ‘యంగ్ ఆస్ట్రేలియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డ్ సంపాదించిన లీ, 2009లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, ‘యంగ్ గ్లోబల్ లీడర్’ అవార్డ్ సంపాదించుకుంది.
 
 ఇప్పుడు ఎమోటివ్ సంస్థ ఒక అడుగు ముందుకు వేసింది, ఒక ప్రభంజనం సృష్టించడానికి... అదే మన బ్రెయిన్ వేవ్స్‌తో కమాండ్స్ ఇవ్వడం... అంటే ఈ ఎలక్ట్రికల్ డివైజ్‌ని, మన చేతులు కాళ్లు వాడకుండా కేవలం మెదడు ఆదేశాలతో పనిచేయించడం.
 
 అంగవైకల్యం ఉన్న వారికి ఆసరాగా...

 
 ఈ ఎమోటివ్ ఇన్‌సైట్ టెక్నాలజీ ఉంటే చాలు, స్విచ్‌లు, హెడ్‌సెట్‌లు, స్టీరింగ్‌లు వాడాల్సిన పనిలేదు. కార్, వీల్ ైచైర్ నుండి చిన్న టాయ్ హెలికాప్టర్ వరకూ అన్నీ ఎలక్ట్రికల్ మయమే. ఇందులో ఏ పరికరాన్నైనా, మన మెదడుతో కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు తాన్ లీ. మన తలకి ఈ హెడ్‌సెట్ తగిలించుకుని ‘వీల్ ఛైర్’ కదలడాన్ని ఊహించుకుంటే, ఆ ఆలోచన జెనరేట్ చేసేసి బ్రెయిన్ వేవ్స్‌ని మన ఎమోటివ్ ఇన్‌సైట్ డీకోడ్ చేసి, ఆ సిగ్నల్‌ని ఎలక్ట్రికల్ వీల్ ఛైర్‌కి పంపుతుంది. ఆ వీల్ చైర్‌కి ఉండే చిన్న కంప్యూటింగ్ పరికరం, ఆ సంకేతానికి అనుగుణంగా, వీల్ చైర్‌ని కదుపుతుంది. అంతేకాదు, మన మెదడుతో కార్ స్టీరింగ్‌ని తిప్పొచ్చు.
 
 ఒక హెలికాప్టర్‌ని ఎగరవేయొచ్చు. అంతేకాదు... మనసులో ఒక సంగీత బాణీనో లేక పరికరం యొక్క శబ్దాన్నో ఉహించుకుంటే అది కూడా కంప్యూటర్‌లో ప్లే అయ్యే టెక్నాలజీ డెవలప్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా ఊహించుకోవడమే. కంప్యూటర్ ప్రోటోటైప్‌గా ఉన్న ఈ మోడల్ వచ్చే సంవత్సరం జనవరిలో మార్కెట్‌లోకి వస్తుందన్న అంచనా... వీటి ధర 299 డాలర్లతో ప్రారంభం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం... ప్రపంచాన్ని మీ ఊహతో ఊపెయ్యండి.
 
 - జాయ్
 
 మన ఆలోచనలని బట్టి బ్రెయిన్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది.  స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మన మెదడు స్థితి (స్టేట్ ఆఫ్ మైండ్) వివరాలని మన మొబైల్‌కి గానీ పీసీకి గానీ పంపిస్తుంది.
 
 ఈ బ్రెయిన్ రీడర్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ పేరు ‘తాన్ లీ’. వియత్నాంకి చెందిన లీ, తన చిన్నతనంలోనే ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement