ఆ పెళ్లికి బెబో హాజరవుతుందట! | Image for the news result A Minute With: Kareena Kapoor Khan | Sakshi

ఆ పెళ్లికి బెబో హాజరవుతుందట!

Published Wed, Jun 24 2015 11:32 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

ఆ పెళ్లికి బెబో హాజరవుతుందట!

ఆ పెళ్లికి బెబో హాజరవుతుందట!

గాసిప్
కొందరు ప్రేమికులు విడిపోయాక... ఇక ఎప్పటికీ కలుసుకోరు. కొందరు విడిపోయినా... ఒకరికొకరు కలుసుకోక పోయినా ‘నీ సుఖమే నే కోరుకున్నా’ అని మౌనంగా పాటలు పాడుకుంటారు. కొందరు ప్రేమికులు మాత్రం... వీడిపోయాక మంచి స్నేహితులుగా మిగిలిపోతారు. ఒన్స్ అపాన్ ఏ టైమ్... చాక్లెట్ బాయ్ షాహీద్ కపూర్, కరీనాకపూర్‌లు జగమెరిగిన ప్రేమికులన్నది తెలిసింది. ఆ తరువాత ఏమైందో ఏమోగానీ... ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఇద్దరి మధ్య మాటలు లేని పరిస్థితి ఏర్పడింది.

ఆ తరవాత ఇద్దరూ సినిమాల్లో బిజీ అయిపోయారు. అయితే కాలం స్నేహితులుగా మళ్లీ వారిని దగ్గర చేసింది. ఒకప్పుడు వాళ్లు ప్రేమికులు కావచ్చునేమోగానీ, ఇప్పుడు మాత్రం మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి ‘ ఉడ్తా పంజాబ్’ సినిమాలో కలిసి నటిస్తున్న  విషయం తెలిసిందే. ఇది సరే, ఇంతకీ కరీనా షాహిద్ పెళ్లికి హాజరు కానుందా? హాజరు కావడమేమిటి... షాహిద్ కుటుంబంలోని వ్యక్తిలాగే పెళ్లి పనుల్లో చురుగ్గా పాల్గొంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతు న్నాయి. చూద్దాం మరి ఏంజరగనుందో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement