యుద్ధంలో పాల్గొంటున్న ఒక సైనికుడు చాలా రోజుల తర్వాత ఇంటికి ఫోన్ చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాక, ‘నాన్నా, నేనో స్నేహితుడిని ఇంటికి వెంటపెట్టుకొస్తున్నా’ చెప్పాడు కొడుకు. ‘సంతోషం బాబూ, తప్పకుండా రానీ’ అన్నాడు తండ్రి. ‘అయితే నాన్నా, ఒక మాట చెప్పాలి. అతడికి ఎవరూ లేరు. అతడి కుడి కాలికి యుద్ధంలో పెద్ద గాయమైంది. మొత్తంగా కాలే తీసేయాల్సి వచ్చింది’ చెప్పాడు కొడుకు. ‘అయ్యో, అలాగా! అతడు ఎక్కడైనా ఉండటానికి ఏర్పాటు చేద్దాం’ హామీ ఇచ్చినట్టుగా చెప్పాడు తండ్రి.
‘అలా కాదు నాన్నా, అతణ్ని మనతోనే మన ఇంట్లోనే ఉంచుకోవాలని నా ఉద్దేశం’ స్థిరంగా చెప్పాడు కొడుకు. ‘ఒకటి రెండు రోజులంటే సరే, అతణ్ని మనతోనే ఉంచుకోవడమంటే ఏమిటో ఆలోచించావా? ఒక అవిటివాడికి సేవ చేయగలిగే స్థితిలో మనం ఉన్నామా? అదెంత కష్టమో నీకు తెలియదా? కొంచెం నిదానంగా ఆలోచించు’ కోపంగా అన్నాడు తండ్రి. మరేం మాట్లాడకుండా కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు కొడుకు. తర్వాత ఫోన్ పెట్టేశాడు. కొన్ని రోజుల తర్వాత తండ్రికి ఓ ఉత్తరం వచ్చింది. ‘నాన్నా, ఒక అవిటివాడిని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో అన్నట్టు మాట్లాడావు. నీ కోణంలో అది నిజమే కావొచ్చు. అందుకే నేను ఇంటికి రాకూడదని నిర్ణయించుకున్నాను’.
Comments
Please login to add a commentAdd a comment