అతినిద్రతోనే ఎక్కువ చేటు!
పరిపరి శోధన
కంటినిండా నిద్ర కునుకు లేకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతుంటారు. అయితే, చాలీచాలని నిద్ర కంటే అతినిద్రతోనే ఎక్కువ చేటు కలుగుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఉంటే పక్షవాతం ముప్పు గణనీయంగా తగ్గుతుందని, అయితే అంతకు మించి నిద్రపోయే అలవాటుంటే మాత్రం పక్షవాతం ముప్పు 145 శాతం పెరుగుతుందని తమ పరిశోధనలో తేలినట్లు న్యూయార్క్ వర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.దాదాపు 2.90 లక్షల మందిపై ఏడాది పాటు నిర్వహించిన విస్తృత అధ్యయనంలో ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు వారు వివరిస్తున్నారు.