పొదుపు సలహా
మాకు 5, 8 ఏళ్ల వయసు పిల్లలున్నారు. వాళ్ల పై చదువుల కోసమని ప్రతి నెలా చెరి ఐదువందలు ఆర్డీ (రికరింగ్ డిపాజిట్) కడుతున్నాను. ఈ ఆర్డీ ఇంకో రెండేళ్లలో పూర్తవుతుంది. ఆ వచ్చిన మొత్తాన్ని ఎందులో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ల ఇంజినీరింగ్, మెడిసిన్ చదువులకు ఉపయోగపడుతుంది? - చందన, హైదరాబాద్
ఆర్డీ ఒక సాంప్రదాయిక పెట్టుబడి మార్గం. ఇది సురక్షితమైనదే. నష్టభయం ఉండదు. ప్రస్తుతం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఆర్డీపై దాదాపు 9 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. అయితే దీనివల్ల దీర్ఘకాలిక ఖర్చులను ఎదుర్కోవ డం సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం ఇంజినీరింగ్, మెడిసిన్ ఓపెన్ కేటగిరీలో చదవాలంటే నాలుగేళ్లకు కలిపి ఒక్కొక్క పాపకు 4 లక్షలు ఖర్చు అవుతుంది అనుకుందాం. ఐదేళ్ల పాపకు ఇంజినీరింగ్‌కు 12 ఏళ్లు, ఎనిమిదేళ్ల పాపకు తొమ్మిదేళ్ల వ్యవధి ఉంది. ప్రస్తుతం ఆరు శాతం ద్రవ్యోల్బణం ప్రకారం ఈ మొత్తం 12 సంవత్సరాలకు సుమారు 8 లక్షలు, తొమ్మిదేళ్లకు 7 లక్షలు అవుతాయి. కాబట్టి ఈ ఖర్చును దృష్టిలో ఉంచుకుని ఆర్డీని కొనసాగించండి. మరో చెరో రు. 1500 ఇప్పటి నుండి ఈక్విటీ గ్రోత్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతూ, రెండు సంవత్సరాల తర్వాత వచ్చే ఆర్డీ మొత్తాన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చు.
- రజని భీమవరపు, సిఎఫ్‌పి, జెన్‌మనీ
మీ ఆర్థిక, పొదుపు లక్ష్యాల సాధనలో ఎదురయ్యే సందేహాల నివృత్తికోసం, మీ సమస్యలను ఈ చిరునామాకు పంపించండి పొదుపు సలహా, కేరాఫ్ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34, aame.sakshi@gmail.com
పిల్లల ఇంజినీరింగ్ చదువు కోసం...
Published Wed, Nov 5 2014 12:32 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement