
చెవిలో పొల్యూషన్ సైరన్
మహానగరాన్ని నిత్యం మాయదారి జబ్బులు పలకరిస్తూనే ఉన్నాయి. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న సిటీవాసులు ఇప్పుడు రణగొణ ధ్వనులతో మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు.
మహానగరాన్ని నిత్యం మాయదారి జబ్బులు పలకరిస్తూనే ఉన్నాయి. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న సిటీవాసులు ఇప్పుడు రణగొణ ధ్వనులతో మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. నాయిస్ పొల్యూషన్‌తో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈఎన్‌టీ (ఇయర్, నోస్, త్రోట్) విషయంలో నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమవుతోందని చెబుతున్నారు డాక్టర్లు. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, హారన్ల మోతలు, భారీ శబ్దాల వల్ల చాలా మంది వినికిడి శక్తి కోల్పోతున్నారు.
సాధారణంగా యాభై దాటాక తలెత్తే వినికిడి లోపం.. ఇప్పుడు 35 ఏళ్లకే పలకరిస్తోందని చెబుతున్నారు ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డా.విష్ణుస్వరూప్‌రెడ్డి. ఎయిర్ పొల్యూషన్ కారణంగా అలర్జిక్ రైనిటీస్ అనే జబ్బు వస్తుంది. దీని వల్ల ఎప్పుడూ ముక్కు నుంచి నీరు కారడం, తుమ్ములు రావడం, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. కాలుష్యం కారణంగా చాలామంది సైనసైటిస్ వ్యాధికి కూడా గురవుతున్నారు. ఇది నేరుగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఇక సిటీలో విపరీతంగా పెరిగిపోతున్న శబ్దకాలుష్యం చెవులకు ఖేదాన్ని మిగిలిస్తోంది. 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం విన్నప్పుడు వినికిడి శక్తిపై ప్రభావం పడుతుంది. ఇంత సౌండ్‌లో 8 గంటల పాటు పని చేస్తే చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. భారీ ఫ్యాక్టరీలు, ఆటోషెడ్‌లలో పని చే సేవారు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సెల్‌ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడటం వల్ల కూడా చెవి నరాలు దెబ్బతింటున్నాయి.
జాగ్రత్తలు తప్పనిసరి
* ఎక్కువ శబ్దాలు వచ్చే కంపెనీల్లో పనిచేసే వాళ్లు కనీసం ఆరు నెలలకు ఒకసారైనా ఆడియో మెట్రి పరీక్ష చేయించుకోవాలి
* పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఇయర్ మఫ్స్ (చెవి రక్షణ కవచాలు) తప్పనిసరిగా వాడాలి
* పాశ్చాత్య దేశాల్లో శబ్దాలు వచ్చే కంపెనీల్లో ఇయర్ మఫ్స్ విధిగా వాడేలా నిబంధన విధించారు.
ఇక్కడ కూడా అలాగే చేయాలి
* ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు కూడా ఇయర్ మఫ్స్ వాడటం మంచిది.
* సెల్‌ఫోన్‌లో గంటల తరబడి సంభాషించడం తగ్గించుకోవాలి.