
ఎర్న్‌జాయ్
పాకెట్ మనీ ఇమ్మంటే పేరెంట్స్ లెక్కలడుగుతారు. స్మార్ట్ ఫోన్ కావాలంటే ‘అంతొద్ద’ంటారు. చివరికి బండిలో పెట్రోల్ పడాలన్నా.. పైసల కోసం దిక్కులు చూడాల్సిందే. ఇంత భరించడం కన్నా... సొంతంగా సంపాదించుకోవడం మిన్న. అందుకే ఇప్పుడు సిటీ యూత్ ‘వీకెండ్ వర్క్’ మనీ మ్ంరత్రాన్ని జపిస్తోంది. సంపాదనలో పడి స్టడీస్ నుంచి వారానికోసారి దొరికే హాలిడేని మిస్సయిపోతున్నారనుకోకండి.. ఇటు ఇన్‌కమ్‌తో పాటు అటు ఫన్‌టైమ్ కూడా ఎంజాయ్ చేస్తున్న వీరి స్టైల్ తెలుసుకోవాలంటే- గెట్ ఇన్ టు దిస్ స్టోరీ..
వీకెండ్స్ అంటే ఇంట్లో కూర్చుని హోంవర్క్
చేసుకోవడం.. టీవీ చూడటం.. ఫ్రెండ్స్‌తో కలసి జాలీగా గడపడం.. లేదంటే బద్ధకంగా రోజుని లాగించేయడం... ఇంతేనా?. చదువుకునే వయసులో ఎంజాయ్ చేయాలంటే జేబు నిండుగా ఉండాలి. ప్రతి అవసరానికీ అయిన వాళ్ల దగ్గర చేయిచాచి.. బతిమాలి.. ఎన్నాళ్లు?. ఇటువంటి సమస్యతో బాధపడే యూత్.. ‘వీకెండ్ వర్క్’ను నమ్ముకుంటున్నారు. తమ టాలెంట్‌ని మెరుగు పెట్టుకుంటూ, అదే చేత్తో పాకెట్ మనీ సంపాదించుకుంటూ, వీకెండ్ ఫన్‌ని మిస్సవ్వకుండా అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.. మొబైల్ రీచార్జ్, పెట్రోల్ ఖర్చులు, షాపింగ్ వంటి చిన్ని చిన్ని అవసరాల కోసం తామే డబ్బు సంపాదించుకుంటున్నారు. మనసుకు నచ్చిన పని చేస్తూ గుండె నిండా సంతోషాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ విషయంలో వీరిని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయటంతో మరింత ఉత్సాహంతో ముందుకెళుతున్నారు
ఈ యంగ్‌స్టర్స్.
- ..:: సిద్ధాంతి
మ్యూజిక్‌తో మ్యాజిక్
నాకు మ్యూజిక్ అంటే ప్యాషన్. అందరూ లీజర్ టైంలో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ నాకు సింగింగ్ అంటేనే లీజర్ టైం స్పెండ్ చెయ్యటం లాంటిది. ఎక్కువగా ఇంగ్లిష్ పాటలు వింటూ ఉంటాను. అవే పాటలు కాఫీ షాప్స్, రెస్టారెంట్స్‌లో వీకెండ్స్‌లో పాడుతుంటాను. నా వాయిస్‌లో ఉండే హస్కీనెస్
వల్లనేమో చాలామందికి నా పాటలు బాగా నచ్చుతాయి. మంచి ఇన్‌కమ్ వస్తుంది.
- ప్రణిత, స్టూడెంట్
ఆడుతూ ‘పాడుతూ’..
స్కూల్ డేస్ నుంచీ పాడటం అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీస్‌లో, స్కూల్ ఫంక్షన్స్‌లో పాటలు పాడేదాన్ని. ఇప్పుడు ప్రతి వీకెండ్‌లో సిటీలోని ఒక కాఫీ షాప్‌లో హిందీ, ఇంగ్లిష్ పాటలు పాడుతుంటాను. అక్కడికి వచ్చిన వారు నా పాటలు విని ఎంజాయ్ చేయటం నాకు చాలా తృప్తినిచ్చే విషయం. మ్యాషప్ తరహా సింగింగ్ నా ప్రత్యేకత. అంటే ఒక భాషలో పాటలోని చరణంతో మొదలుపెట్టి, వేరే భాషలోని పాటల పల్లవితో చేసే తమాషా సంగీతమిది. నా టాలెంట్ నా ఖర్చులకు సరిపడా ఇన్‌కమ్ ఇస్తోంది. దీంతో నా పర్సనల్ ఎక్స్‌పెన్సెస్‌కు ఇప్పుడు నో ప్రాబ్లమ్.
- వాణిశ్రీ, డిగ్రీ ఫస్ట్ ఇయర్
క్లిక్‌మనిపిస్తే క్యాష్...
క్యాండిడ్ ఫొటోగ్రఫీ, నేచర్ ఫొటోగ్రఫీ, గెలాక్సీ ఫొటోగ్రఫీ.. ఇలా ప్రతి క్లిక్ ద్వారా ఏదో ఒకటి నేర్చుకోవటం అంటే నాకు ఇష్టం. కెమెరా క్లిక్‌మన్న ప్రతిసారీ నాకు సంతోషం కలుగుతుంది. ఫ్రెండ్స్‌కి సర్‌ప్రైజ్ ఫొటోషూట్స్, కపుల్ ఫొటోషూట్స్ అంటే మహా సరదా. ఫొటోగ్రఫీతో పాకెట్ మనీ సంపాదించుకోవటం అనేది ఓ అంశమైతే... దానివల్ల నేను పొందే ఆనందం వెలకట్టలేనిది. నా కెమెరాతో ప్రపంచం చుట్టి రావాలన్నదే నా జీవిత లక్ష్యం.
- భార్గవ అయ్యర్,
డిగ్రీ ఫైనల్ ఇయర్
రాక్ బ్యాండ్ ప్రోగ్రామ్స్..
స్టూడెంట్ గ్రూప్ ద్వారా ర్యాప్ ప్రదర్శనలు ఇస్తుంటాం. వీకెండ్ అంటే మా టీం అందరితో కలిసి ఒక చక్కటి ర్యాప్ ప్రదర్శన ఇవ్వాల్సిందే. నాతో పాటు సహీం అలీ, ఆసిఫ్ పటేల్, ఆక్విబ్ సయ్యద్ వీరంతా మా టీం సభ్యులు. మేం పెర్ఫార్మ్ చేసే ప్రతి పాటలో ఒక కథ ఉంటుంది. అసలు ర్యాప్ అంటేనే స్టోరీ టెల్లింగ్.. దీనికి సిటీలో మంచి డిమాండ్ ఉంది. అదే మాకు ఇన్‌కమ్ సోర్స్‌గా మారింది.
- సైఫ్ తుంబీ,
యంగ్ గన్స్ గ్రూప్