ఇయర్ ఫోన్ చిక్కుముడి పడకుండా ఉండాలంటే...
ఇయర్ ఫోన్ చిక్కుముడి పడకుండా ఉండాలంటే...
Published Mon, Jul 7 2014 1:57 PM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
మీ సెల్ ఫోన్ల ఇయర్ ఫోన్లు పాకెట్లో లేదా బ్యాగ్ లో పెట్టుకుంటే చిక్కు బడిపోవడం, ముడిపడటం జరుగుతోందా? అర్జంటుగా ఫోను వస్తూంటే ఇయర్ ఫోన్ చిక్కు ముడులు విప్పుకుంటూ చికాకు పడుతున్నారా? అలాగైతే ఈ వార్త మీ కోసమే.
యుకె లోని ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గత చాలా ఏళ్లుగా ఈ 'పెద్ద' సమస్యను పరిష్కరించేందుకు రీసెర్చిల మీద రీసెర్చిలు చేస్తున్నారు. దారాలు, తాళ్లు సంచుల్లో పెట్టినా, ఒక చోట ఉంచినా ముడిపడిపోవడం ఖాయం. కానీ ఆ ముడులను విప్పడం మాత్రం మహా తలనొప్పిగా ఉంటుంది.
ఆ శాస్త్రవేత్తలు చాలా రకాల పరిశోధనలు చేస్తూ చేస్తూ చివరికి కనుగొన్నదేమిటంటే ఇయర్ ఫోన్ రెండు కొసలు - అంటే చెవిలో ఉంచుకునే కొస, సెల్ ఫోన్ ను అమర్చే కొస కలిపి ఉండేలా ఉంచుకుంటే చిక్కుపడదట. దీనికి లూప్ కంజెక్చర్ అని పేరు పెట్టారు.
కాబట్టి మీ ఇయర్ ఫోన్ చిక్కు ముడులు పడకుండా ఉండాలంటే రెండు కొసలనూ కలిపేయండి.
Advertisement