
మలయాళ మ్యాజిక్..!
నటనలో సూపర్ స్టార్ అయినా.. అంతర్లీనంగా ఉన్న కళ మోహన్‌లాల్‌ను నిద్దర పోనిచ్చినట్టు లేదు. ఆ మధ్య ఎప్పుడో మెజీషియన్ గోపీనాథ్ ముకుంద్‌తో కలసి ‘డేరింగ్ ఎస్కేప్’ యాక్ట్ చేయబోయి.. రాష్ట్రమంతా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గాడు. ఎట్టకేలకు చాలా ఏళ్ల తరువాత రీసెంట్‌గా త్రివేండ్రంలో మ్యాజిక్ చేసి తనలోని మరో కోణాన్ని సంతృప్తి పరిచాడు. మెజీషియన్ జనియా భుంగారాతో ‘ఫ్లోటింగ్ లేడీ’ ట్రిక్ ప్రదర్శించి ఆడియన్స్ చప్పట్లు అందుకున్నాడట ఈ మలయాళ మెగాస్టార్.