ఒక్క సిట్టింగ్‌లోనే కొవ్వు మాయం | one Sitting in the fat vanished | Sakshi
Sakshi News home page

ఒక్క సిట్టింగ్‌లోనే కొవ్వు మాయం

Published Sun, Oct 12 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

ఒక్క సిట్టింగ్‌లోనే కొవ్వు మాయం

ఒక్క సిట్టింగ్‌లోనే కొవ్వు మాయం

కేవలం ఒకే ఒక్కసారి మీరు క్లినిక్ సందర్శించండి... మీ శరీరంలోని అధిక కొవ్వును పూర్తిగా తొలగించుకోండి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ‘క్రయోలిపోలైసిస్’ ప్రక్రియతో దూరమవుతుందని చెబుతున్నారు ‘హెల్దీకర్‌‌వ్స’ వైద్యుడు డా.కిషోర్ రెడ్డి. కొందరు ఊబకాయులు బరువు తగ్గినా, పొట్ట, పిరుదులు వంటి భాగాల్లో కొవ్వు పూర్తిగా తగ్గని వారికీ, అలాగే కొందరు సన్నగా ఉన్నా పొట్ట, తొడల భాగాల్లో కొవ్వు అధికంగా చేరిన వారికి ఆహార నియమాలతో ప్రయోజనం ఉండదు. కాబట్టి వీరికి వెంటనే ‘క్రయోలిపోలైసిస్’ చేయించుకోవడం చాలా వరకు ఉపయోగపడుతుంది.
 
ఊబకాయం వల్ల ఒంట్లోని జీవక్రియలన్నీ అస్తవ్యస్తమైపోతాయి. ఫలితంగా మధుమేహం, హైబీపీ, అధిక కొలెస్టరాల్ వంటి రుగ్మతలెన్నో చుట్టుముట్టి పరిస్థితి చివరికి గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్, కీళ్లనొప్పులు వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. ఆడవారిలో గర్భ, కాన్పు సంబంధమైన సమస్యలకు ఊబకాయం కారణమవుతోంది. శరీర భాగాల్లోని పేరుకుపోయిన కొవ్వును తొలగించే అత్యంత, అధునాతన, సురక్షితమైన విధానం ‘క్రయోలిపోలైసిస్’.

‘క్రయో’ అంటే చల్లబర్చడం.. ‘లిపో’ అంటే కొవ్వు, ‘లైసిస్’ అంటే విచ్ఛిన్నం చేయడం. శరీర భాగాలను చల్లబర్చడం ద్వారా కొవ్వు కరిగించడం అన్నమాట. సర్జరీ లేకుండా.. ఒకట్రెండు సిట్టింగ్‌లలోనే శరీరంలోని కొవ్వును తొలగించుకోవచ్చు. ఇది లైపోసక్షన్‌కు ప్రత్యామ్నాయంగా సర్జరీ లేకుండా కొవ్వును తొలగించే విధానం. దీనికి ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ‘యూఎస్‌ఎఫ్‌డీఏ’ అనుమతి కూడా లభించింది.
 
క్రయోలిపోలైసిస్ చేసే విధానం:
మొదటగా డాక్టర్ శరీరంలోని కొవ్వు పేరుకు పోయిన భాగాలను గుర్తిస్తారు. ఆ భాగాలను ప్రత్యేకమైన చికిత్సతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోతాయి. తర్వాత శరీరం నుంచి వెళ్లిపోతాయి. క్రయోలిపోలైసిస్ కేవలం కొవ్వు కణాలపై మాత్రమే ప్రభావం చూపుతుంది. మిగిలిన చర్మ కణాలు, కండరాలు, నాడీకణాలు యథాతథంగానే ఉంటాయి. సర్జికల్ పద్ధతి అయిన లిపోసక్షన్ చికిత్సలోని దుష్ఫలితాలను నివారించుకోవాలనుకునే వారికి క్రయోలిపోలైసిస్ సరైన ప్రత్యామ్నాయం.

కొవ్వు తగ్గడం, బరువు తగ్గడం ఒకటేనని చాలామంది అపోహ పడతారు. అయితే బరువు తగ్గినప్పుడు శరీరంలోని కొవ్వు కణాల పరిమాణం చిన్నగా మారుతుంది. వాటి సంఖ్య మాత్రం అంతే ఉంటుంది. బరువు పెరిగినప్పుడు ఇవి మళ్లీ పెద్దవవుతాయి. క్రయోలిపోలైసిస్ చికిత్సా విధానం ఈ కొవ్వు కణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ చికిత్స జరిగే సమయంలో మీరు ఎంచక్కా పుస్తకాలు చదువుకోవచ్చు! ల్యాప్‌టాప్‌పై పనిచేసుకోవచ్చు. తర్వాత ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. ఈ చికిత్స చేయించుకోవాలనుకునే వారు ముందుగా క్రయోలిపోలైసిస్ డాక్టర్‌ని కలిసి ఆయన సూచనలు తీసుకోవడం తప్పనిసరి.
 
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
ఈ చికిత్స జరిగిన ప్రాంతంలో శరీరం కొంత సమయం ఎర్రగా మారుతుంది. కాని కొద్ది సమయంలోనే మామూలు స్థితికి చేరుకుంటుంది. Cryoglobulinemia  Ìôæ-§é- Paraxyenal Cold hemoglobinuria తో బాధ పడేవారు ఈ చికిత్స చేయించుకోరాదు. హైదరాబాద్‌లోని ‘హెల్దీకర్‌‌వ్స స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్’ అనుభవజ్ఞులైన డాక్టర్లచే అందిస్తున్న ఈ చికిత్సా విధానంతో అత్యుత్తమమైన నాణ్యతా విలువల్ని పాటిస్తూ, ఉత్తమమైన ఫలితాలను సాధిస్తుంది.
 
 Healthii Curvess Pvt Ltd, Jubleehills / Secunderabad, Cell: 9705 828282,9705 838383

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement