పోలవరానికి ‘పట్టిసీమ’ గ్రహణం | 'Pattiseema' eclipse to Polavaram | Sakshi
Sakshi News home page

పోలవరానికి ‘పట్టిసీమ’ గ్రహణం

Published Wed, Apr 8 2015 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

కొవ్వూరి త్రినాధరెడ్డి

కొవ్వూరి త్రినాధరెడ్డి

సందర్భం
 
 బడ్జెట్‌కు ముందే యుటిలిటీ సర్టిఫికెట్‌ను పంపితే రూ. 1,000 కోట్లు కేటాయిస్తామని కేంద్రం చెప్పినా పంపక బాబు పోలవరానికి వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ ఏ మేలూ చేయని పట్టిసీమతో పోలవరాన్ని అటకెక్కించాలని చూస్తున్నారు.  
 
 తాడి చెట్టు ఎందుకు ఎక్కా వంటే దూడ మేత కోసమన్న ట్టుంది మన రాష్ట్ర సర్కారు తీరు. ‘సత్వర నీటి ప్రయోజన పథకం’ కింద కేంద్రం ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించిన రూ. 850 కోట్లను మరే ప్రభుత్వ మైనా అయితే... పూర్తికానున్న ప్రాజెక్టులకు కేటాయించి వెం టనే రైతులకు సాగునీటిని అందించడానికి ప్రాధాన్యం ఇచ్చి ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం రూటే వేరు. అందుకే హఠాత్తుగా తెరపైకి తెచ్చిన పట్టిసీమ ఎత్తి పోతల పథకానికి ఏకంగా రూ.775 కోట్లను కేటాయిం చింది. ఉభయ గోదావరులు, కృష్ణా డెల్టా, రాయలసీమ రైతులకెవరికీ ఏ మేలూ చేయలేని పట్టిసీమను చేపట్టిం ది. పైగా అది సీమకు తక్షణమే నీరందించేందుకేనని, గోదావరి, కృష్ణాజిల్లాల రైతాంగం ప్రయోజనాల కోసమే నని నమ్మించాలని ప్రయత్నిస్తోంది! పట్టిసీమపై జారీ చేసిన జి.ఒ. ఆర్టీ. నం: 200ను పరిశీలిస్తే బాబు ప్రభుత్వ దగాకోరుతనం బట్టబయలవుతుంది. పట్టిసీమ వద్ద లిఫ్ట్‌ను 14 మీటర్ల ఎత్తున అమరుస్తున్నట్టు అది పేర్కొం ది. కాబట్టి గోదావరి వరద నీటిని మాత్రమే కృష్ణకు లిఫ్ట్ చేస్తామని ప్రభుత్వ వాదన. కానీ ధవళేశ్వరం బ్యారేజీ వద్ద డెడ్ స్టోరేజీ 10.67 మీటర్లు, గరిష్ట వరద స్థాయి (ఎంఎఫ్‌ఎల్) 13.67 మీటర్లు. 40 కిలోమీటర్ల దూరం లోని పట్టిసీమ, ధవళేశ్వరం కంటే రెండు మీటర్ల ఎత్తులో ఉంది. అంటే పట్టిసీమ వద్ద 15.67 మీటర్ల ఎత్తున లిఫ్ట్‌ను అమరిస్తేనే వరద జలాలనే పంపు చేస్తారని నమ్మ డం సాధ్యం. కానీ పంపును 14 మీటర్ల ఎలివేషన్‌లో, ఫుట్‌వాల్వును కనీస నీటినిల్వ స్థాయి 12.5 మీటర్ల వద్ద అమరుస్తున్నారు. అంటే కనిష్ట నీటి స్థాయి నుంచి కూడా నీటిని లిఫ్ట్ చే సే ఉద్దేశం ఉన్నట్టే. గోదావరి జిల్లాల అవస రాలు తీరాకనే 14 మీటర్లపై నుంచే లిఫ్ట్ చేస్తామని ప్రభు త్వం అంటోంది. జీవోలో ఆ ప్రస్తావనే లేదు. ఎత్తిపోతల విషయంలో జీవోల్లోని పరిమితులు, నిషేధాలు అమలు కావు. తాటిపూడి, గూటాల, వేగేశ్వరపురం, పుష్కర, చాగల్నాడు తదితర లిఫ్ట్‌లు మొదటి పంట తర్వాత పని చేయకూడదని జీవోలో ఉంది. కానీ తాగునీటి, పారిశ్రా మిక అవసరాల కోసం అవి నిరంతరం పనిచేస్తూనే ఉం టాయి. వరద జలాలు లభించే కొద్ది రోజులే పట్టిసీమ లిఫ్ట్‌లు పనిచేస్తాయనే నోటి మాట నీటి మూట కాకుం డా ఉంటుందా?

 3,20,000 ఎకరాల పోలవరం కుడికాలువ ఆయ కట్టులో పశ్చిమ గోదావరిలో 2,00,000 ఎకరాలు వివిధ ఎత్తిపోతల కింద సాగవుతున్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మిగతా 1,20,000 ఎకరాల ఆయ కట్టుకు పాక్షికంగా నీరందిస్తామని జీవో నం: 1 చెబు తోంది. అంటే పంట కాలంలో సగానికా? ఆయకట్టులో సగానికా? చంద్రబాబే చెప్పాలి. కృష్ణానదిలోకి 80 టీఎంసీల నీటిని పంప్ చేస్తామంటున్నారు. ఉభయ గోదావరుల తాగునీటి, పారిశ్రామిక అవసరాలే 8 టీఎంసీలు. మరి ఒక్క కృష్ణా డెల్టాకే అంత నీరు దేనికి? బచావత్ అవార్డు ప్రకారం కుడి కాలువకు తాగునీటి కేటాయింపు లేదు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మెట్టప్రాంతాలకు మాత్రం ఎడమ కాలువకు 23.44 టీఎంసీలను కేటాయించింది. ప్రస్తుతం ఎడమ కాలువ ప్రాంత రైతులు తాగునీటి కోసం పోరాటానికి  సిద్ధమ వుతున్నారు. అదే జరిగితే చంద్రబాబు ఎడమ కాలువపై మరో లిఫ్ట్ పెట్టేస్తానంటారు. ఆపై పోలవరం అవస రమే లేదని వాదించొచ్చు. పాత అంచనా ప్రకారం పోల వరం ప్రాజెక్టు వ్యయం రూ. 12,000 కోట్లు. ప్రస్తుత అంచనా రూ. 15,000 కోట్లకు పైనే. ఈ బడ్జెట్లో కేంద్రం కేటాయించింది రూ. 100 కోట్లు! ఈ కేటాయింపులతో అది ఎన్నటికి పూర్తికావాలి? ఇది కూడా బాబు ‘పుణ్య మే.’ ఏ ప్రాజెక్టుకైనా కేంద్ర బడ్జెట్‌కు ముందే యుటిలిటీ సర్టిఫికెట్‌ను (యూసీ) పంపాలి. యూసీ ఇస్తే పోలవరా నికి వెయ్యి కోట్లయినా కేటాయించడానికి సిద్ధమేనని కేంద్రం చెప్పినా బాబు ప్రభుత్వం యూసీని ఇవ్వక ఆ ప్రాజెక్టుకు వెన్నుపోటు పొడిచింది. అది చాలక, పోలవ రంపై కపట ప్రేమను ఒలకబోస్తూ ఉభయగోదావరి జిల్లాల ప్రజలను మోసగిస్తున్నారు. ప్రాజెక్టు నిధులను ఖర్చుపెట్టకుండా పనులను ఆపేసినందుకు పోలవరం అథారిటీ మొట్టికాయలు వేసినా దానికి పట్టడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వస్తే పోలవరాన్ని అటకెక్కిం చేస్తాడని 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలు అక్షర సత్యాలని బాబు పట్టిసీమ దొంగాట రుజువు చేసి చూపిస్తోంది.

 కృష్ణానది నుంచి సీమకు సాగునీటిని అందించడం తోపాటూ అనంతపూర్ దాహార్తిని తీర్చేస్తానంటూ బాబు చెబుతున్న మాటలను సీమవాసులెవరూ నమ్మ డం లేదు. సీమ ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవా, గాలేరునగరి, వెలుగొండ, తెలుగుగంగలకు బడ్జె ట్‌లో బాబు నామమాత్రంగా నిధులను కేటాయించారు. హంద్రీనీవా, గాలేరునగరి పూర్తికావడానికి రూ. 4,500 కోట్లు కావాలి. అది పూర్తికాకుండానే సీమకు తాగునీరు, సాగునీరు ఎలా అందిస్తారు? సమాధానం లేదు. ఈ ఏడాది జనవరిలో విజయవాడలో జరిగిన రాష్ట్ర రైతు సంఘాల సదస్సు... పట్టిసీమకు కేటాయించిన రూ. 1,300 కోట్లకు, మరో రూ. 1,200 కోట్లు కలిపి మొత్తం రూ. 2,500 కోట్లను రాయలసీమ ప్రాజెక్టులకు కేటా యించి తాగు, సాగు నీటి అవసరాలను తీర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దాన్ని పెడచెవిన పెట్టి బాబు తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. అది చాలక హంద్రీనీవా, తెలుగుగంగల కోసం ఎన్టీఆర్ కృష్ణా మిగు లు జలాలపై హక్కును వదులుకుంటామని ఆనాడే కేంద్ర జల సంఘానికి తెలిపారు. బాబు సహా తర్వాతి ప్రభుత్వాలూ దాన్నే కొనసాగిస్తూ వచ్చాయి. అంతా తెలిసి కూడా కృష్ణా మిగులు జలాలపై హక్కులను వైఎస్‌ఆర్ వదిలేసుకున్నారని ఎదురుదాడి చేయడం చంద్రబాబుకే చెల్లింది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభు త్వం కల్లబొల్లి కబుర్లు మాని, పట్టిసీమను రద్దు చేసి పోలవరం పరిపూర్తిపై దృష్టిని కేంద్రీకరిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందనడం నిస్సందేహం.

 (వ్యాసకర్త ‘రాష్ట్ర నీటి వినియోగదారుల సమాఖ్య’ ప్రధాన కార్యదర్శి)
 ఫోన్ నం: 9440204323

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement