రామ్..‘స్వచ్ఛభారత్’
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో యువతరం స్ఫూర్తితో రగిలిపోతోంది. ‘స్వచ్ఛభారత్’ మంత్రం జపిస్తోంది. హీరో రామ్ గురువారం ఎల్లారెడ్డిగూడ ప్రభుత్వ పాఠశాల పరిసరాలు, రోడ్లను ఊడ్చేశాడు. ఆయనకు స్థానిక కుర్రకారు జత కలిశారు. వంద కోట్ల మంది తలచుకుంటే దేశాన్ని స్వచ్ఛంగా మార్చవచ్చన్నాడు రామ్. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామినవడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు.