
సరదాగా కాసేపు
సాఫ్ట్‌వేర్ రంగంలో జెండర్ డైవర్సిటీ కోసం మైక్రోసాఫ్ట్ హోస్ట్ చేస్తున్న కోడెస్ ఫర్ విమెన్ కోడర్స్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. విమెన్ టెకీల కోసం మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో నగరానికి చెందిన 84 మంది విమెన్ ప్రోగ్రామింగ్ కోడర్స్ పాల్గొన్నారు. వారి వర్క్ ఎక్స్‌పీరియన్స్, పర్సనల్ లైఫ్ అచీవ్‌మెంట్స్ గురించి అందరితో పంచుకున్నారు. కాసేపు వర్క్ టెన్షన్‌ను పక్కనపెట్టి సందడిగా గడిపారు. బిజినెస్ ఐడియాలనూ పంచుకున్నారు. వీరిలో విజేతలను ఎంపిక చేసి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డెరైక్టర్ అనిల్ బ న్సాలీ తదితరులు హాజరయ్యారు.