సంథింగ్ స్పెషల్
శ్రీ విద్యాస్ సెంటర్ ఫర్ ది స్పెషల్ చిల్డ్రన్, రక్ష ఫౌండేషన్లు నిర్వహించిన ‘ఆపేక్ష 2015’ అబ్బురపరిచింది. ఇందులో బుద్ధిమాంద్యం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కదంబాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. రవీంద్రభారతిలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతానికి విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రముఖ గాయకులు వినోద్‌బాబు, సురేఖామూర్తి, నిత్యసంతోషిణి సంగీత విభావరి వీనుల విందుగా సాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఆంధ్రాబ్యాంక్ జీఎం కృష్ణప్రసాద్ లక్ష రూపాయల చొప్పున... పెన్షనర్ వి.దామోదర్ పది వేల రూపాయలు బుద్ధిమాంద్యం పిల్లల సహాయార్థం అందించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, శ్రీ విద్యాస్ ఈడీ శాంతి వెంకట్ పాల్గొన్నారు.
- సాక్షి, సిటీబ్యూరో