
అంతా ఓకే... అది తప్ప!
టెలివిజన్‌ని కేవలం వినోదానికే పరిమితం చేయకుండా... కొన్ని సమస్యలను తీర్చడానికి, కొందరికి న్యాయం
టెలివిజన్‌ని కేవలం వినోదానికే పరిమితం చేయకుండా... కొన్ని సమస్యలను తీర్చడానికి, కొందరికి న్యాయం చేయడానికి, వీలైనన్ని జీవితాలను చక్కదిద్దడానికి ఉపయోగించడం హర్షించదగిన విషయం. దీనికి హిందీ చానెళ్లు ఎప్పుడో పెద్ద పీట వేశాయి. ఇటీవలి కాలంలో తెలుగు చానెళ్లు కూడా ఆ దిశగా ముందడుగు వేస్తున్నాయి. ఆ క్రమంలో ‘బతుకు జట్కా బండి’ ఓ విజయవంతమైన అడుగు. కుటుంబాల్లో వచ్చే సమస్యలను తీర్చడానికి ఏర్పాటు చేసిన మంచి వేదిక అది.
దీన్ని అనుసరించే ‘అందమైన జీవితం’ అనే కార్యక్రమం మొదలైందీ మధ్య. ప్రోగ్రామ్ ఉద్దేశం మంచిదే. కాకపోతే అది నడుస్తున్న విధానంలో మాత్రం కాస్త మార్పు అవసరమేమో అంటున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే శాంతియుతంగా నడవాల్సిన చర్చలు ఒక్కోసారి హింసకు దారి తీస్తున్నాయి. మనుషులన్న తర్వాత ఎమోషన్స్ ఉంటాయి. కోపాన్ని కొన్నిసార్లు అణచుకోలేకపోవచ్చు. కానీ వాళ్లు కలబడి కొట్లాడుకుంటున్నప్పుడు కార్యక్రమ నిర్వాహకులు అడ్డుపడకుండా వినోదం చూస్తూ కాసేపు నిలబడటం మాత్రం అంతగా బాలేదు. పోనీ దాన్ని ఎడిట్ అయినా చేయాలిగా! అదీ చేయడం లేదు. టీఆర్పీని పెంచుకోవడానికి ఇదో మార్గమని అనుకుంటున్నారో ఏమో మరి!