సింహంభట్ల సుబ్బారావు
సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష పండితులు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగించవచ్చు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలు అంతంతగా ఉంటాయి. ఉద్యోగస్తులు పైస్థాయి వారి నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోహణి, మృగశిర 1,2పా.)
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. అంచనాలు నిజమవుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊరట చెందుతారు. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో ధనవ్యయం.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఏపని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ధనవ్యయం.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాల నుంచి చాకచక్యంగా బయటపడతారు. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో కుటుంబసమస్యలు. అనారోగ్యం.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
మీ సమర్థతను చాటుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు. పనులు చకచకా సాగుతాయి. శ్రమ ఫలిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు తీరుస్తారు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన వార్తలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ఊరట కలిగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
కొత్త పనులకు శ్రీకారం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటాబయటా అనుకూలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
అనుకోని విధంగా డబ్బు అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం మధ్యలో దూరప్రయాణాలు. ధనవ్యయం.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ముఖ్య నిర్ణయాలలో తొందరవద్దు. పనులలో జాప్యం. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. బంధువులు ఒత్తిడులు పెంచుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి. కళారంగం వారికి పురస్కారాలు. వారం చివరిలో వాహనయోగం.