మాట మంచిదైతే... | Mancidaite word .. | Sakshi
Sakshi News home page

మాట మంచిదైతే...

Published Sun, Sep 6 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

మాట మంచిదైతే...

మాట మంచిదైతే...

ఆత్మబంధువు
‘‘రేఖా.. రేఖా! ఎక్కడున్నావ్?’’ గట్టిగా అరుస్తోంది అత్తగారు రత్నమాంబ.
 ‘‘హా... ఇక్కడే ఉన్నానత్తమ్మా’’ వంటింట్లోంచి పలికింది రేఖ.
 ‘‘కాస్త కాఫీ ఏమైనా ఇస్తావా?’’
 ‘‘హా.. ఐదు నిమిషాలు.’’
 ఐదు నిమిషాల్లో మాంచి ఫిల్టర్ కాఫీ రెడీ చేసి ఇచ్చింది అత్తగారికి.
 ‘‘ఇదేంటీ.. కషాయం తాగినట్టుంది. పెళ్లయ్యి ఇన్నేళ్లైంది... కాఫీ పెట్టడం కూడా రాకపోతే ఎలా? వంట గదిలో కాఫీ కలిపితే హాల్లోకి వాసన రావాలి. తాగు తుంటే చిరుచేదుగా, కాస్తంత తియ్యగా ఉండాలి. ఇది ముక్కు దగ్గర పెట్టుకున్నా రావట్లేదు. రుచీ పచీ లేదు.’’
 మనసు చిన్న బుచ్చుకున్న రేఖ వంటింట్లోకి వెళ్లి కాఫీ రుచి చూసింది. బాగానే ఉంది. మరి ఆవిడెందుకలా మాట్లాడిందో అనుకుంటూ ఉండిపోయింది.
   
 ‘‘మమ్మీ... నా డ్రెస్ ఎలా ఉంది?’’ అడిగింది మైత్రి.
 ‘‘బ్యూటిఫుల్.. ఏంజిల్‌లా కని పిస్తున్నావు’’ అంటూ ముద్దు పెట్టుకుంది రేఖ.
 ‘‘నువ్వలాగే దాన్ని గారాబం చేస్తూండు. చేతికి చిక్కదు’’ అంది రత్నమాంబ.
 ‘‘వాట్ గ్రాండ్‌మా... ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంటావ్?’’ అడిగింది మైత్రి.
 ‘‘నేనేమన్నానే. ఆ డ్రెస్ చూస్తే ఎవరైనా అంటారు.’’
 ‘‘నా డ్రెస్ నా ఇష్టం. నీకేంటీ?’’
 ‘‘నాకేంటా.. కాళ్లు విరగ్గొడతా.’’
 ‘‘చూడు మమ్మీ... ఏమంటుందో’’ అంటూ తల్లివైపు చూసింది మైత్రి.
 ‘‘నాయనమ్మే కదా, లీవిట్’’ అంది .
 కానీ ఇలా రత్నమాంబ ఎప్పుడూ ఏదో ఒకటి అనడం... తను, పిల్లలు బాధ పడటం జరుగుతూనే ఉంది. అయినా ఏరోజూ భర్తకు చెప్పలేదు. కానీ ఈరోజు చెప్పేయాలనుకుంది రేఖ.
   
 ‘‘ఆనంద్... నువ్వేం అనుకోనంటే ఓ మాట చెప్తా’’
 ‘‘చెప్పవోయ్.. వద్దన్నదెవరు!’’
 ‘‘అత్తమ్మ రోజూ సూటి పోటి మాటలంటూనే ఉంటోంది. నేను సర్దుకుపోతున్నాను. బట్.. పిల్లలు మనసు కష్టపెట్టుకుంటున్నారు.’’
 ‘‘పెద్దావిడ కదా.. తెలిసీ తెలియక ఏదో అంటుంది. పట్టించుకోకు’’ అన్నాడు సింపుల్‌గా.
 ‘‘అది కాదు ఆనంద్. ఆవిడ నెగెటివ్ కామెంట్స్ పిల్లలపైన ఎక్కడ నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయోనని నా భయం.’’
 ‘‘మాటలు ఎఫెక్ట్ చూపించడ మేంటోయ్... నీ చాదస్తం కాకపోతే.’’
 ‘‘చాదస్తం కాదు.. నిజం. అయినా మీకు మాటల్లో చెప్పడంకంటే చేతల్లో చూపిస్తే బెటర్.’’
 ‘‘చూపించు.. చూపించు’’ అన్నాడు ఆనంద్ పెద్ద పట్టించుకోకుండా.
 రేఖ గుప్పెడు గుప్పెడు అన్నం మూడు గాజు సీసాల్లో వేసి కాసిన్ని నీళ్లు పోసి మూతలు బిగించింది. ఒక సీసా పూజ గదిలో, మరో సీసా హాల్లో, మరోటి బెడ్‌రూమ్‌లో పెట్టింది.
 ‘‘ఈ సీసాలేంటీ, వాటిల్లో అన్నం వేసి నీళ్లు పోయడమేంటీ?’’అడిగాడు ఆనంద్.
 ‘‘వెయిట్ అండ్ సీ సర్’’ అంది రేఖ నవ్వుతూ. ఆ తర్వాత ఆనంద్ ఆ విషయం మర్చిపోయాడు. కానీ నెల రోజుల తర్వాత రేఖ గుర్తుచేసింది.
 ‘‘హా... అప్పుడేదో సీసాలు పెట్టావ్ కదా. ఏమయ్యాయవి?’’ అడిగాడు.
 ‘‘మీరే చూడండి.’’
 ‘సరే’ అంటూ హాల్లో ఉన్న సీసా మూత తీశాడు. ముక్కుపుటాలు బద్ద లయ్యేలా దుర్వాసన. లోపలంతా నల్లగా మారిపోయింది. బెడ్‌రూమ్‌లో సీసా తీసి చూశాడు. దుర్వాసన లేదు. తర్వాత పూజ గదిలోని సీసా తీసుకుని చూశాడు. మంచి వాసన వస్తోంది.
 ‘‘హేయ్.. ఏంటిదీ. మూడింటిలో ఒకేసారి రైస్ వేసి పెట్టావ్. మరి మూడూ మూడు రకాల వాసన వస్తున్నాయేంటీ?’’ అర్థంకాక అడిగాడు ఆనంద్.
 ‘‘దట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ అవర్ వర్డ్స్. పూజగదిలో మనం పాజిటివ్‌గా ఉంటాం, ప్రార్థనలు చేస్తాం కాబట్టి దాన్ని ఫెర్మెం టేషన్ అలా జరిగింది. అత్తమ్మ రోజంతా హాల్లో కూర్చుని నెగెటివ్‌గా మాట్లాడు తుంది కాబట్టి అదలా కుళ్లిపోయింది.’’
 ‘‘అవునా? అది సాధ్యమా?’’ అడిగాడు ఆశ్చర్యంగా.
 ‘‘సాధ్యమే. వాటర్‌పైన జపాన్ సైంటిస్ట్ డాక్టర్ మసారు ఇమోటో ప్రయోగాలు చేశారు. ఆ వీడియోలు యూ ట్యూబ్‌లో చూశాను. ఆయన రాసిన ‘ద హిడెన్ మెసేజెస్ ఆఫ్ వాటర్’ పుస్తకం గురించి కూడా చదివాను. మీరూ చూడండి ఓసారి.’’
 ‘‘తప్పకుండా చూస్తా. అమ్మక్కూడా అర్థమయ్యేలా చెప్తా. అది సరే కానీ... బెడ్‌రూమ్‌లోది డిఫరెంట్‌గా ఉందేంటీ?’’
 ‘‘బెడ్‌రూమ్‌లో మనం పెద్దగా మాట్లాడుకోం కాబట్టి.. అదలా...’’ కన్నుగీటింది రేఖ.
 
 - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement