పార్టీ
కృష్ణ: నాకు ఇంత పెద్ద పార్టీ ఎందుకిస్తున్నావో చెప్పనే లేదు
శ్రీధర్: నేను చేసిన అప్పుల్ని పంచుకోవడానికి నాకో మనవడు పుట్టాడు.
మళ్లీ జన్మ!
భార్య: మనం పోతే పునర్జన్మ ఉంటుందా?
భర్త: అది తెలియాలంటే ముందు నువ్వు పోవాలిగా.
శ్రమదోపిడీ
టీచర్: ప్రశాంత్ శ్రమదోపిడీ అంటే ఏమిట్రా?
ప్రశాంత్: మీరు దిద్దాల్సిన పరీక్ష పేపర్లు నాచేత దిద్దించడం.
విశ్వాసం!
నరేష్: నిన్న నేను కొన్న కొత్తకుక్క పిల్లకి మా ఆవిడ నా పేరెందుకు పెట్టిందో అర్థం కావట్లేదురా?
దినేష్: నీలాగే విశ్వాసంగా పడుండాలని కాబోలు.
ఆచారం
మా నాన్న గారు పండక్కి మనిద్దరికీ కొత్త బట్టలు తెచ్చారండీ.
భర్త: వంటోడికి కూడా పండక్కి కొత్తబట్టలు పెట్టే మీ ఆచారం మెచ్చుకోతగ్గదే !
కాపురం!
రంగయ్య: మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావట. ఎలాంటి అల్లుడు కావాలి?
వెంకయ్య: సెల్లుతో కాకుండా పిల్లతో కాపురం చేసేవాడైతే చాలు!!
- టి.దినేష్, భీమారం, వరంగల్
కవ్వింత
Published Sun, Jul 27 2014 12:30 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM
Advertisement
Advertisement