నివృత్తం: రొద్దానికి ఎద్దును, పెనుగొండకు పిల్లను ఇవ్వకూడదు... | won't give bull and girl to Penugonda | Sakshi
Sakshi News home page

నివృత్తం: రొద్దానికి ఎద్దును, పెనుగొండకు పిల్లను ఇవ్వకూడదు...

Published Sun, Apr 27 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM

నివృత్తం: రొద్దానికి ఎద్దును, పెనుగొండకు పిల్లను ఇవ్వకూడదు...

నివృత్తం: రొద్దానికి ఎద్దును, పెనుగొండకు పిల్లను ఇవ్వకూడదు...

ఒకప్పుడు పెనుగొండ ప్రాంతంలో బావులు చాలా లోతుగా ఉండేవట. అప్పట్లో బావులే నీటికి ప్రధాన ఆధారం కాబట్టి... ఇల్లాళ్లంతా బావుల నుంచే నీటిని తోడుకుని, ఇళ్లకు తీసుకెళ్లేవారు. అయితే మరీ లోతు ఎక్కువగా ఉండటం వల్ల, వాళ్లు తోడలేక అవస్థలు పడేవారట. అనారోగ్యం పాలయ్యేవారట. అందుకే ఆ ప్రాంతం వారికి పిల్లనివ్వాలంటే తల్లిదండ్రులు భయపడేవారట.     పెనుగొండకు పిల్లనివ్వడం అంటే... మెరక సేద్యం చేయాల్సిన చోటికి ఎద్దుల్ని పంపడం లాంటిదేనన్న ఉద్దేశంతో ‘రొద్దానికి (ఇదీ ఒక ప్రాంతం) ఎద్దును, పెనుగొండకు పిల్లను ఇవ్వకూడదు’ అంటూ ఉండేవారు. అదే తర్వాత సామెతగా స్థిరపడిపోయింది.
 
అరటిపండును పూర్ణఫలం అని ఎందుకంటారు?
సృష్టిలోని ఫలాలు వేటినైనా తినేటప్పుడు వాటిలోని గింజలను నమిలి పారేస్తాం. అలా పారేసిన విత్తనాలే మళ్లీ మొలకెత్తి మహావృక్షాలై తిరిగి ఫలాలను ఇస్తాయి. అంటే ఎంగిలి విత్తనాల ద్వారా మొలకెత్తిన వాటి ఫలాలనే మనం మళ్లీ ఆరగిస్తాం. దేవుడికి సమర్పిస్తాం. కానీ అరటిపండు మాత్రం అలా కాదు. దాన్ని మనం పూర్తిగా తినేస్తాం. గింజలు పారేయడం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి అరటిపండు అనేది ఎంగిలి విత్తనం ద్వారా మొలచిన మొక్క నుంచి వచ్చింది కాదు. అందుకే దాన్ని దేవునికి సమర్పించడం శ్రేష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి. దానికి తోడు ఇవి అన్ని కాలాల్లోనూ లభిస్తాయి. ఈ కారణాలన్నిటి చేతా అరటిపండును పూర్ణఫలం అంటారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement