పాపిష్టి, చెడ్డ వస్తువులనే 28% శ్లాబు కింద ఉంచాలని జీఎస్టీ కౌన్సిల్ ఏకాభిప్రాయానికి వచ్చింది అంటూ, వాటి జాబితాను ఇంచుమించు 50కి తగ్గించారు. ప్రైవేటు విమానాలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై 28% పన్ను విధించారు. ద్విచక్ర వాహనం ఉండటం ఏ విధంగా పాపిష్టిది లేదా చెడ్డది? విలాసవంతమైన పెద్ద కారు టైరుపైన, సైకిల్ వాలా టైరుపైన కూడా 28% పన్నే. ఎయిర్ కండిషనర్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, వాటర్ హీటర్లు అన్నీ విలాస వస్తువులే అనవచ్చేమో. ‘చెడ్డ’ వస్తువుల ఎంపికలో బుర్రను ఉపయోగించకపోవడమే పెద్ద సమస్యని అనిపిస్తుంది.
ఈ వారం, మళ్లీ ఒకసారి కొన్ని వస్తువులపై పరోక్ష పన్నులను తగ్గించారు. ఇది సాధారణంగా మూడు కారణాల వల్ల జరుగుతుంటుంది. ఒకటి, కొన్ని వస్తువులు రాజకీయంగా సున్నితమైనవి కావడం వల్ల. ఉదాహరణకు, గుజరాత్‌లో ఖాక్రా (కరకరలాడే రొట్టెలాంటి ఉపాహారం) వంటి వస్తువులను మరింత ఖరీదైనవిగా చేస్తే, ప్రతికూలమైన పతాక శీర్షికలను చూడాల్సి వస్తుంది. రెండు, కొన్ని వస్తువులు మరింత ఖరీదైనవిగా మారడం వల్ల వాటి అమ్మకాలు తగ్గి, ఆర్థిక వ్యవస్థను ప్రభా వితం అవుతుందని ప్రభుత్వం భావించడం వల్ల. మూడు, ఫలానా వస్తువులను ఎక్కువ పన్ను విధించాల్సినవిగా పొరపాటున వర్గీకరించామని భావించడం వల్ల. పరోక్ష పన్నులన్నీ సంపన్నులపైన, పేదలపైన ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి అవి చెడ్డవి. నేను, మా డ్రైవర్ ఇద్దరమూ కోకా కోలాకు ఒకే ధర చెల్లిస్తాం. కాబట్టి, ఆదాయం పన్ను వంటి ప్రత్యక్ష పన్నులే మంచి ప్రభావాన్ని చూపుతాయి.
వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో 0%, 0.25%, 3%, 5%, 12%, 18%, 28% అనే ఏడు శ్లాబులున్నాయి. వీటిలో ఏ వస్తువుపై ఏ రేటున పన్ను విధించాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాతినిధ్యం ఉన్న జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. ఏ వస్తువులను 0% శ్లాబు కింద, ఏ వస్తువులను 28% శ్లాబు కింద ఎందుకు ఉంచారో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తి. గత శుక్రవారం వరకు 28% శ్లాబులో 227 వస్తువులు ఉండేవి. చూయింగ్ గమ్ నుంచి వాక్యూం ఫ్లాస్కులు, బట్టల దుకా ణాల్లో వస్త్ర ప్రదర్శనకు వాడే బొమ్మల వరకు అందులో చేర్చారు. జీఎస్టీ కౌన్సిల్ తాజా సమావేశం తదుపరి ఆ విభాగంలో కేవలం 50 వస్తువులే ఉన్నట్టున్నాయి. ఏ వస్తువుపై మనం ఎక్కువ పన్నును చెల్లించాలో జీఎస్టీ కౌన్సిల్ ఎలా నిర్ణయిస్తుంది? ప్రభుత్వం దీన్ని తన సొంత తర్కం ప్రాతిపదికపైనే నిర్ణయిస్తుంది. అది వస్తువు లను ‘పాపిష్టి’ వస్తువులు లేదా చెడ్డ వస్తువులుగా గుర్తిస్తుంది.
ఈ చెడ్డ వస్తువుల జాబితాను తగ్గిస్తున్నట్టు ప్రకటిస్తూ బిహార్ ఉప ముఖ్య మంత్రి సుశీల్ మోదీ... 28% శ్లాబు కింద ఉన్న చూయింగ్ గమ్, చాక్లెట్లు, షేవింగ్ వస్తువులు, బట్టలు ఉతికే పౌడర్లను 18% శ్లాబులోకి మారుస్తున్నట్టు తెలిపారు. ‘‘పాపిష్టి, చెడ్డ వస్తువులు మాత్రమే 28% వర్గం కింద ఉండాలని (కౌన్సిల్) ఏకా భిప్రాయం’’ అని కూడా చెప్పారు. భారత ప్రభుత్వం, రాజకీయ వేత్తలు ఏది పాపిష్టి లేదా చెడ్డ వస్తువు అని ఎలా నిర్ణయిస్తారనేది ఆసక్తికరమైన ప్రశ్న. ఒకటి, క్రైస్తవ సాంప్రదాయానికి చెందిన ‘పాపం’ అనే భావన హిందూ మతంలో లేదు. బైబిల్‌లోని పాపం దేవునికి వ్యతిరేకంగా చేసిన నేరం. క్రెస్తవంలోని పాపం కిందకు సోమరితనం, భోగలాలసత కూడా వస్తాయి. హిందువులలో ఈ భావన లేదు. అయితే, సామాన్యార్థంలో పాపం అంటే అనైతికమైనది లేదా అనైతికతను పెంపొందింపజేసేది లేదా అలా అనిపించేది... మద్యం వంటివి. కానీ మద్యం జీఎస్టీ జాబితాలో లేనే లేదు. రాష్ట్రాలు తమకు ఇష్టమొచ్చిన రేటుతో మద్యంపై పన్ను విధించవచ్చు. ఈ వాస్తవం మూలంగా మద్యం చౌకగా దొరికే వీలుండటమే విచిత్రమైన సంగతి. ముంబైలోని ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా,ఆహారంపై 18%, మద్యంపై 10% విలువ ఆధారిత పన్ను చెల్లించాలి. ఇది మన çపన్నుల వ్యవస్థ లోప రహితమైనది కాదని తెలుపుతుంది.
ఇక చెడ్డ వస్తువు విషయం మరింత జటిలమైనది. ఏ వసువులను లేదా సేవ లను వినియోగించడం సామాజికంగా అవాంఛనీయం అని భావిస్తే అవన్నీ చెడ్డవే. మద్యం వీటిలో భాగమే. పొగాకును, ప్రత్యేకించి ఇటీవలి కాలంలో జంక్ ఫుడ్‌ను కూడా అలాగే భావిస్తున్నారు. అందువల్లనే మనం పాపిష్టి, చెడ్డ వస్తువుల జాబితా వైపు ఓసారి దృష్టి సారించడం అవసరం. మీ ఇళ్లకు, కార్యాలయాలకు వేసే రంగు లను, కళాకారులు వాడే రంగులను, షూ పాలిష్‌ను కూడా అందులో చేర్చారు. అతి నిరుపేద వీధి కార్మికులు కూడా షూ పాలిష్‌ను కొని, ఉపయోగిస్తారు. అలాంటి వారిని శిక్షించడం దేనికి? ఇవి పాపిష్టివి అని లేదా చెడ్డవి అని అనడానికి ప్రాతి పదిక ఏమిటో ఊహకు అందేది కాదు. ఇకపోతే ఆ జాబితాలో టపాసులు ఉన్నాయి. అవెలాగూ పేదలకు అందుబాటులోనివి కావు. కానీ అగ్నిమాపక సాధ నాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇది చూసి నేను నిర్ఘాంతపోయాను. భద్రతా ప్రమాణాలు ప్రపంచంలోనే అతి తక్కువ స్థాయిలో ఉన్న దేశంలో... ఆ ప్రమాణాలకు కట్టుబడటాన్ని ఖరీదైనదిగా ఎందుకు మార్చినట్టు? ప్రైవేటు విమా నాలు, కార్లు, ద్విచక్రవాహనాలపై 28% పన్ను విధించారు. ద్విచక్ర వాహనం ఉండటం ఎలా పాపిష్టిది లేదా చెడ్డది. టైర్లపైనా అదే పన్ను. అంటే విలాసవంత మైన పెద్ద కారున్న వ్యక్తిలాగే సైకిల్ వాలా కూడా టైరుపై అంతే పన్ను చెల్లించాలి.
ఎయిర్ కండిషనర్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, వాటర్ హీటర్లు అన్నీ ఈ వర్గం కిందనే చేర్చారు. మనలాంటి దేశంలో అవన్నీ విలాస వస్తువులేనని మరో సారి వాదించవచ్చు. కానీ, ఈ వస్తువులను ఎంపిక చేసేటప్పుడు బుర్రను ఉప యోగించకపోవడమే పెద్ద సమస్యని నాకు అనిపిస్తుంది. పాన్ మసాలాపై 28% పన్ను. కానీ తమలపాకుల మీద పన్ను 0%. రెండూ ఒకే అలవాటను ప్రోత్సహిం చేవే. వీటిలో ఒకటి ఎలా చెడ్డ వస్తువు అయ్యిందో స్పష్టత లేదు. జీఎస్టీ శ్లాబు లన్నిటినీ ఓసారి చూడాల్సిందిగా పాఠకులను ప్రోత్సహిస్తున్నాను (ఆన్‌లైన్లో ఛిb్ఛఛి.జౌఠి.జీn వంటి వెబ్‌సైట్లలో లభిస్తుంది). తద్వారా జీఎస్టీ వర్గీకరణ తర్క బద్ధంగా ఉందో లేదో వారు తమంతట తామే నిర్ణయించుకోగలుగుతారు.
అసలు విషయం ప్రభుత్వాన్ని తప్పుపట్టాలనేది కాదు. ప్రతిపక్షాల పాలన లోనివి సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ జీఎస్టీ కౌన్సిల్‌లో భాగంగా ఉన్నాయి. ప్రజలు నిర్వచించిన పాపం లేదా చెడు అనే విషయాలపై ఎలాంటి చర్చా లేకుండా పౌరులను వారు నామమాత్రమైన వారుగా భావించారా లేదా అనేదే సమస్య. దీన్ని ముగిస్తూ ఓ విషయాన్ని చెప్పాలి. కాలమిస్టులు, స్వతంత్ర పాత్రికేయులు ఆర్జించే డబ్బుపై జీఎస్టీ లేదు.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘ aakar.patel@icloud.com
Comments
Please login to add a commentAdd a comment