కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి మూలంగా ప్రజలు సహజంగానే కలత చెందడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ మనం అజాగ్రత్తగా ఉండే పక్షంలో ఇంతకన్నా పెద్ద ప్రమాదమే మన ముందున్నది. అదే.. కరోనా సంక్షోభాన్ని అవ కాశంగా తీసుకుని ఆ సాకు మీదే మన అమె రికన్ రాజకీయ జీవితంలోని దుష్టశక్తులు చైనాతో యుద్ధాన్ని రెచ్చగొట్టడానికి, చైనా ప్రజల పట్ల ద్వేష భావాల్ని పెంచడానికి ప్రయ త్నిస్తున్నాయి. నిజానికి చైనా ప్రజలు వీరోచిత చరిత్ర గల ప్రజలు. వాళ్లు మన అమెరికా ప్రజలకు మిత్రులే కానీ మన శత్రువులు కారు. అందుకే మనం జాగరూకులమై ఉండాలి.
– అమెరికా ప్రసిద్ధ మేధావి, పరిశోధకులు, లివెలిన్ హెచ్. రాక్‌వెల్
మనకు పేరుమోసిన సామెతలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘వస్తువొకచోట, అనుమానం వేరొకచోట’ అని. అలాగే ‘నిజం నిలకడ మీద గానీ తేలదు’ అనే సామెత కూడా. కరోనా వైరస్ మహమ్మారి గురించి మనం వింటున్న అనేక గాథలలో ఒకటి.. ఇవి క్రిముల సహాయంతో మానవాళిపై వినాశానికి తలపెట్టే యుద్ధానికి ఉదాహ రణ అని. కాబట్టి చైనా సోషలిస్టు దేశం కాబట్టి పెట్టుబడిదారీ కూటమికి నాయకత్వం వహిస్తున్న అమెరికాను నాశనం చేయడం కోసమే చైనా కరోనా వైరస్‌ను వూహాన్ బయో పరిశోధనాగారంలో సృష్టించి ప్రపంచం మీదికి వదిలిందని అమెరికా అధ్యక్షుడు, అమెరికా రాజకీయ రంగంలో తీవ్ర అవిశ్వాసానికి గురవుతున్న ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేయడంతో.. నిజమే కాబోలునని అనేక దేశాలు భావించాయి. చైనాను అనుమానించాయి.
ఈ అనుమానం చివరికి ఇంత తొందరలో పెనుభూతంగా మారి తిరిగి అమెరికానే కరోనా దోషిగా నిలబెట్టే వార్తలు నింపాదిగా వెలువడుతున్నాయి. ఆ వచ్చే వార్తలకు, విశ్లేషణలకు, నిరూపణలకు కేంద్రం కూడా అమెరికాయే కావడం విశేషం. ఈ వార్తలలో ఒకటి– 2019 అక్టోబరులోనే అంటే 2019 నవంబరులో ఇది కరోనా వైరస్ అని చైనాలో నిర్ధారణ కావడానికి నెలరోజుల ముందే కృత్రిమంగా భారీస్థాయిలో మొదట ఒక ల్యాబ్‌లో అమెరికా కరోనా వైరస్‌పై ప్రయోగం నిర్వహించింది. ఈ కృత్రిమ ప్రయోగానికి అతి గోప్యంగా భారీగా నిధులు సమకూర్చి జాన్స్ హాప్కిన్స్ ఆరోగ్య భద్రతా కేంద్రీయ సంస్థతో కలిసి ప్రయో గాన్ని నిర్వహించిన వారు ప్రపంచ మహా కోటీశ్వరులైన బిల్ గేట్స్– మెలిందా ఫౌండేషన్. బహురహస్యంగా జరిగిన ఈ వైరస్ సృష్టి ప్రయోగానికి ఈవెంట్ 201 అని నామకరణం చేసి ఎంపిక చేసిన బహుకొద్దిమంది రాజకీయులు, మేధావులు, మాజీ విదేశాంగ శాఖ, మాజీ సైనికాధికారుల సెలెక్టెడ్ బృందానికి గోప్యంగా చూపారు.
సరిగ్గా 2019 అక్టోబర్‌లో జరిగిన ఈ ప్రయోగం సందర్భంగానే అంటే అక్టోబర్ 18–27 మధ్య చైనాలోని వూహాన్ నగరంలో ప్రపంచ దేశాల సైనిక విన్యాసాలు జరిగాయి. ఆ విన్యాసాలలో అమెరికా నుంచి వచ్చి చేరిన 300 మంది అమెరికా సైనికులూ పాల్గొన్నారు. ఆ తర్వాత రెండు వారాలకే వూహాన్‌లో మొట్టమొదటి కోవిడ్–19 కరోనా మహమ్మారి వ్యాధి బయటపడింది. సరిగ్గా తనపై అమెరికా అప్పటికే ప్రారంభిం చిన ప్రచారాన్ని చైనా విమర్శిస్తూ మీ సైనికులు ఇక్కడికి వచ్చి అంటిం చిన వ్యాధి ఫలితమే ఈ సరికొత్త కరోనా అని ప్రకటించింది.
నిజానికి, ఇంతకన్నా ఒక పెద్ద రహస్యాన్ని లివెలిన్ రాక్‌వెల్ వెల్లడిస్తూ ఇలా పేర్కొన్నారు: ‘కరోనా కొత్త వైరస్ వ్యాధి వూహాన్‌లో ప్రారంభమైనా నిజానికి ఈ వైరస్ అమెరికా నుంచే చైనాకు చేరిందన డానికి సాక్ష్యం ఉంది. ఎందుకంటే, ఇతరులెవరూ ప్రచురించని వార్త లను అమెరికాలోని ‘గ్లోబల్ రీసెర్చి’ అనే ప్రత్యేక శీర్షికలో లారీ రోమ నాఫ్ (పరిశోధకుడు) వెల్లడిస్తాడు. అందుకు గల మౌలికమైన కారణా లను ఆయన ఇలా పేర్కొన్నాడు: ‘అన్ని రకాల క్రిమి సముదాయాలకు అమెరికా తల్లివేరు. కోవిడ్–19 మహమ్మారికి మూలం అంతా అమె రికాలోని ఫోర్ట్ డెట్రిక్ వద్ద ఉన్న క్రిమి ఆయుధోత్పత్తి సైనిక ప్రయోగ శాల! కరోనా వైరస్ వార్త బహిర్గతమైన మరుక్షణమే జీవాయుధాలు ప్రయోగించి చేసే యుద్ధ ప్రయోగశాలను (ఫోర్ట్ డెట్రిక్) కాస్తా మూసే శారు. ఇంతకుముందు నేను మరొక విశ్లేషణలో ప్రస్తావించినట్టు, 2005–2012 సంవత్సరాల మధ్య కాలంలో అమెరికా 1,059 ఘట నలు చూసింది. ప్రయోగశాలలోని రోగక్రిముల్ని దొంగిలించడమో లేదా అమెరికా జీవశాస్త్ర ప్రయోగశాలలనుంచి తప్పించడమో అంతకు ముందు పదేళ్లుగా (ప్రతి మూడు రోజులకి సగటున ఒక్కో లాబ్ నుంచి) సాగుతోంది’ (వార్ ఆఫ్ చైనా: లివెలిన్ రాక్‌వెల్: 17–3–20) అంతేగాదు,
మరొక ప్రసిద్ధ అమెరికన్ మీడియా నిపుణుడు, పరిశోధకుడు డాక్టర్ క్రీగ్ రాబర్ట్స్ మరికొన్ని విశేషాలను ఇలా వివరిస్తున్నారు: ‘అమె రికా యుద్ధతంత్ర వ్యవస్థ అయిన ‘పెంటగాన్’ డీఏఆర్‌పీఏ సంస్థలు, జీవాయుధాలు, జీవ సాంకేతిక శాస్త్ర రంగాలలోనేగాక సూక్షా్మతిసూక్ష్మ సాంకేతిక విజ్ఞానంలోనూ, రోబోల నిర్మాణ శాస్త్రంలోను తదితర అనేక సాంకేతిక రంగాలలో కూడా చేస్తున్న ప్రయోగాలు ప్రజలలో అలజడి కారణమవుతున్నాయి. డీఏఆర్‌పీఏ సంస్థ తలపెట్టిన అనేక పరిశోధ నలలో మైక్రోచిప్స్ సాయంతో మానవ మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడంతోపాటు ఆ జ్ఞాపకాలను నామరూపాలు లేకుండా మెదడునుంచి తొలగించనూవచ్చు.
అలాగే ఎన్నికల్లో ఉపయోగించే ఓటింగ్ యంత్రాల సాఫ్ట్‌వేర్‌లో జటిల సమస్యలను సృష్టించవచ్చు, తొలగించనూవచ్చు.. అంతేగాదు, అమెరికన్ డీఏఆర్‌పీఏ సంస్థ, పెంటగన్ గత చరిత్ర అంతా జీవాయుధాల సృష్టితో నిండినదే. ఇక ఈ సంస్థలే తాజాగా మానవుల జన్యువులను, వాటి లక్షణాల్నే పూర్తిగా తారుమారు చేసే ప్రయోగాలలో ఉన్నాయి. అంతేగాదు, చివరికి మాన వులలోని జీవకణాలను చంపి జన్యువుల విధ్వంసాన్ని జాతీయ భద్రత పేరిట యుద్ధ ప్రయోజనాల కోసం వినియోగించడానికి వీలుగా పరిశోధనలు జరుగుతున్నాయని మరవరాదు.
ఈ సందర్భంగా డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ మరొక హెచ్చరికను కూడా (2.2.2020) విడుదల చేశారు: వూహాన్ నగరంలోని క్రిమి శాస్త్రాధ్యయన మెడికల్ వైరాలజీ కేంద్రంతో అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అమెరికన్ సైనిక, వైద్య సంస్థ లకు ప్రత్యక్ష సంబంధాలున్న విషయాన్ని కూడా డాక్టర్ రాబర్ట్స్ ప్రస్తా వించాడు. అమెరికాలోని పరిశోధనా సంస్థలతో అమెరికా సైనిక వ్యవ స్థకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. అయితే డాక్టర్ రాబర్ట్స్ మరొక విశేషాన్ని కూడా జాగరూకత కోసం ప్రస్తావనకు తెచ్చాడు: ‘కరోనా వైరస్ అమెరికా సృష్టించిందే అయితే చైనా కూడా అమెరికా మాదిరే వైరస్ సృష్టికి తామే కారకురాలన్న వాస్తవాన్ని కప్పిపుచ్చగల అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలా కాని పక్షంలో యుద్ధం బద్ధలవుతుంది కాబట్టి. కానీ అలాంటి యుద్ధానికి చైనా సిద్ధంగా లేదని రాబర్ట్స్ అంచనా. అయితే ఒక్కటి మాత్రం నిజంలా తోస్తుంది. ఎందుకంటే, నేటి ప్రభుత్వాల నైతికతను, నిజాయితీని మనం నమ్మలేం కాబట్టి, ఆ విలువలు వాటికి లేవు కాబట్టి. అందుకనే డాక్టర్ రాబర్ట్స్ ఇంతవరకూ జరిగిన ప్రపంచ పరిణాల అనుభవాల దృష్ట్యా కొన్ని పచ్చి తాజా వాస్తవాలను పేర్కొన్నాడు:
గత 20 ఏళ్లలోనే అమెరికా, దానికి లొంగిపోయిన యూరోపియన్ పాలకులూ ఏడు దేశాలపైన పచ్చి అబద్ధాలమీద ఆధారపడి దారు ణంగా దండయాత్రలు చేసి, బాంబులువేసి ప్రజలను కకావికలు చేశారు, కొల్లగొట్టారు. వీటిలో కొన్నింటిని మొత్తంగా నాశనం చేశారు, మరికొన్నింటిని సగం దాకా ధ్వంసం చేశారు. ఈ విధ్వంసం అంతా పచ్చి అబద్ధాలపైన ఆధారపడి సాగించారని మరచి పోరాదు. అబ ద్ధాలమీద ఆధారపడే ప్రెసిడెంట్ బుష్, ప్రెసిడెంట్ ఒబామా (ఇప్పుడయితే ట్రంప్) అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిం చారు. అమెరికా ప్రజల్ని కేవల అనుమానాలపైన ఆధారపడి వేధింపు లకు గురి చేస్తున్నారు. అయినా సరే ఏ ప్రెసిడెంట్‌నూ ఇంతవరకూ అభిశంసనకు గురిచేయలేదు, కొరత వేయలేదు. ఈ పరిస్థితుల్లో అమె రికా ప్రజల్ని కాపాడ్డానికి నిజాయితీకి కట్టుబడగల ఏ ప్రసార మాధ్య మాలూ (మీడియా) ముందుకు రాలేదనీ, దీంతో ప్రభుత్వ పారదర్శ కత మరింతగా ప్రశ్నార్థకమైందనీ రాబర్ట్ రాశాడు.
అంతేగాదు, 2009 నుంచీ అమెరికా పాలకులు హోండూరాస్, ఉక్రైన్, బొలీవియా, బ్రెజిల్, అర్జెంటీనా ప్రభుత్వాల్ని కూలదోశారు. ఈక్వెడార్‌లోని సామా జిక సంస్కరణల ప్రక్రియను కాస్తా వెనక్కి నెట్టేశారు. వెనిజులాలో చావెజ్‌ను కూలదోసి, మదురో ప్రభుత్వాన్ని కూడా సాగనంపే కుట్ర లకు తెరలేపారు. ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో సామ్రాజ్యవాద కృత్రిమ యుద్ధాలు, విభజన రాజకీయాల ఫలితంగా కొరియాను బద్ధలుకొట్టి రెండు కొరియాల, రెండు వియత్నాంల సృష్టికి అమెరికా సామ్రాజ్యవాద పాలకులు కారకులయ్యారన్నది తెలిసిందే. కానీ తన స్వయం ప్రతిభతో అణ్వస్త్ర శక్తిగా తయారైన ఉత్తర కొరియాను బుజ్జగించడానికి, సఖ్యత కోసం వాషింగ్టన్ నుంచి పాంగ్యాంగ్‌కు ట్రంప్ హుటాహుటిన రెండుసార్లు దిగిరావలసి వచ్చింది.
తాజాగా అమెరికా పాలకుల బలహీనపు విస్తరణవాద సామ్రాజ్యశక్తి ఆలోచ నతో, కూల్చవలసిన దేశాలుగా జాబితాతో సిద్ధంగా ఉన్నవి– క్యూబా, ఉత్తర అమెరికా, సిరియా, ఇరాన్, చైనా, రష్యా! అమెరికా సామ్రాజ్య పాలకులకు ఎప్పుడూ ఒక దేశం ‘ఎర’గా తన కంట్లో కదులుతూ ఉండాల్సిందే; అందుకే అన్నాడు మహాకవి– ‘రుణం పెట్టి రణంతెచ్చి/ జనం ధనం ఇంధనమై/ చరణ కరాబంధనమై/జనన జరా దురాక్ర మణల సంగ్రంథనమై’ తనకు ఊడిగం చేస్తూ తన దోపిడీ వ్యవస్థను కాపాడే దేశాలను, ప్రజలనే అమెరికా పాలకులు సహిస్తారు. అయితే చరిత్ర పాఠం మరోలా ఉంటుంది. ‘నూరు గొడ్లను తిన్న రాబందు కూడా గాలి వానకు కొట్టుకుపోయినట్టు’ అమెరికా పాలనాశక్తుల ‘చేవ’ కూడా ‘జావ’గారిపోవడం అనివార్యం. ఇందుకు నిదర్శనం– నిన్నటి వరకూ తెలియని అతిసామాన్య అమెరికన్ నీగ్రో జార్జిలాయిడ్ ఈ రోజు అమెరికా హీరోగా అవతరించడమే!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment