వర్సిటీల్లో 1061 పోస్టుల భర్తీ!
- సీఎం ఆమోదం లభించగానే త్వరలో భర్తీకి చర్యలు
- విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వసతులు సమకూర్చండి
- వీసీలతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో త్వరలోనే 1061 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆ పోస్టులకు ఆమోదం తెలిపిన వెంటనే వైస్‌చాన్స్‌లర్లు పోస్టులను భర్తీ చేసుకోవచ్చని చెప్పారు. విశ్వవిద్యాల యాల బలోపేతంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, అందుకే యూనివర్సిటీల అభివృద్ధికి రూ. 420 కోట్లు ఇచ్చా రని అన్నారు.
ఉప ముఖ్యమంత్రి కడియం 9 యూనివర్సిటీల బలోపేతంపై వైస్‌చాన్స్ లర్లతో సమీక్ష శనివారం నిర్వహించారు. ఇందులో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ వాణీ ప్రసాద్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటాచలం, ప్రొఫెసర్ మల్లేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ, బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో వర్సిటీలకు కొత్త రూపురేఖలు తేవాలన్నారు. ప్రయోగశాలలు, లైబ్రరీలు, విద్యార్థుల వసతులకు, భవనాల మరమ్మతు లకు పెద్ద పీట వేయాలన్నారు. ఆ తరువాతే అదనపు వసతులకు ఖర్చు చేయాలన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ల్యాబ్‌లలో వసతులు కల్పించాలని, మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. నిధులు రాని మిగిలిన వర్సిటీలు కొత్త ప్రతిపాదనలు ఇస్తే సీఎం దృష్టికి తీసుకెళ్తాన న్నారు. నిధులు వచ్చిన వర్సిటీల్లో వాటి ఖర్చు కోసం కన్సల్టెంట్లను నియమించి, పక్కా ప్రణాళికతో ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతితోనే అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.
న్యాక్ గుర్తింపుకోసం ప్రతిపాదనలు పంపండి..
వర్సిటీలకు న్యాక్ గుర్తింపు కోసం వీసీలంతా కృషి చేయాలని కడియం అన్నారు. ప్రతిపాదనలు పంపని వారు కూడా వెంటనే న్యాక్ గుర్తింపుకోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్ష అభియాన్ కింద, యూజీసీ కింద ఎక్కువ నిధులు తెచ్చుకునేలా వీసీలు చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని విశ్వవిద్యాలయాల్లో సేవలన్నీ ఆన్ లైన్ చేయాలన్నారు. ప్రతి యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బందికి, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లోకి తేవాలన్నారు. పీహెచ్‌డీ ప్రవేశాలను మరింత పకడ్బందీగా జరపాలన్నారు. ప్రభుత్వం విద్యార్థుల మెస్ చార్జీల బకాయిలను రద్దు చేసిందని, మెస్ చార్జీలను గణనీయంగా పెంచిందని తెలిపారు. మార్కెట్ డిమాండ్ లేని కోర్సులు, విద్యార్థులకు భవిష్యత్ కల్పించని కోర్సులు లేకుండా చూడాలన్నారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అనేక కంపెనీలు నిధులు వెచ్చిస్తున్నాయని, వీసీలు ఆయా కంపెనీల ప్రతినిధులతో మంచి సంబంధాలు కొనసాగించి నిధులు రాబట్టి అదనపు వసతులు కల్చించడంపై దృష్టి సారించాల న్నారు. అన్ని వర్సిటీల్లో కామన్ అకడమిక్ క్యాలెండర్ అమలు చేసేలా చర్యలు చేపట్టాల న్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కూడా ఇష్టం వచ్చినట్లు నిర్వహించకుండా వాటిని క్రమబ ద్ధీకరించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని, తద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచాలని కడియం సూచించారు.