నాతోనే కేబినెట్‌కు సమగ్ర రూపు | With me a comprehensive outline to the Cabinet | Sakshi
Sakshi News home page

నాతోనే కేబినెట్‌కు సమగ్ర రూపు

Published Sat, Mar 12 2016 4:51 AM | Last Updated on Wed, Aug 15 2018 7:59 PM

నాతోనే కేబినెట్‌కు సమగ్ర రూపు - Sakshi

నాతోనే కేబినెట్‌కు సమగ్ర రూపు

నన్ను కౌన్సిల్ చైర్మన్‌గా చేస్తారనుకోను: కడియం

 సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తనను ఏరికోరి తెచ్చుకున్నారని, ఎంపీగా ఉన్న తనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కేబినెట్ నుంచి తనను తొలగించి కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారని అనుకోవడం లేదని, అలాంటి అవసరమే రాదని తోసిపుచ్చారు. తనతోనే కేబినెట్‌కు ఒక రూపు వచ్చిందని, తాను చేరిన తర్వాతే మంత్రివర్గ కూర్పునకు సమగ్రత వచ్చిందని అన్నారు. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకుడిని కాదని, తాను బాధ్యతలు చేపట్టాక విద్యాశాఖ పనితీరు పురోగతి గణనీయంగా మెరుగుపడిందని చెప్పారు. శుక్రవారం విలేకరులతో  మాట్లాడుతూ కడియం ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement