నెహ్రూ జూలాజికల్ పార్కు స్వర్ణోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలను పురస్కరించుకొని 12 ఏళ్లలోపు చిన్నారులకు ఉత్సవాలు ముగిసే వరకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు.
బహదూర్‌పురా, న్యూస్‌లైన్: నెహ్రూ జూలాజికల్ పార్కు స్వర్ణోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలను పురస్కరించుకొని 12 ఏళ్లలోపు చిన్నారులకు ఉత్సవాలు ముగిసే వరకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 10వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను ఆదివా రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు. నెహ్రూ విగ్రహం, జూపార్కు 50 వసంతాల లోగోను ఆవిష్కరిస్తారు. ఈనెల 7న రియా పక్షుల ఎన్‌క్లోజర్‌ను రాష్ట్ర అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ప్రారంభిస్తారు