4.64 లక్షల మంది మిస్సింగ్
ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలోనూ బోగస్ ఎన్‌రోల్‌మెంట్
♦ 60.63 లక్షలున్నట్లు చెబుతున్నా.. ఆన్‌లైన్‌లో ఉన్నది 55.99 లక్షలే
♦ ప్రభుత్వ స్కూళ్లలో పోస్టుల కోసం తప్పుడు లెక్కలు!
♦ ప్రైవేటు స్కూళ్లలోనూ అదే తంతు..
♦ మదర్సాల్లో సగం మంది వివరాలే నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 4,63,782 మంది విద్యార్థులు కనబడుట లేదు! అవును.. ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యాల్లోని స్కూళ్లలో గతేడాది 60,63,313 మంది విద్యార్థులు చదువుతున్నట్లు లెక్కలు చూపిం చగా.. ఇప్పుడు వారి సంఖ్య ఏకంగా 55,99, 531 మందికి పడిపోయింది. ఇన్నాళ్లు పేపరుపై ఇచ్చిన లెక్కలకు, ఆన్‌లైన్‌లో నమోదు చేసిన లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. హేతుబద్ధీకరణలో తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు చూపితే తమ పోస్టులను ఎక్కడ రద్దు చేస్తారనే ఆందోళనతో ప్రభుత్వ స్కూళ్లలో కొం దరు ఉపాధ్యాయులు ఎక్కువ మంది విద్యా ర్థులు ఉన్నట్లు చూపించారు.
తమ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారంటూ ప్రైవేటు పాఠశాలలు కూడా తప్పుడు ప్రచారం చేసుకున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రతి విద్యార్థి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో అసలు విష యం బయటప డింది. ఇన్నాళ్లూ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ (డైస్) డేటాలో యాజ మాన్యాలు చూపిన లెక్కలకు, వాస్తవ విద్యా ర్థుల సంఖ్యకు పొంతన లేదని వెల్లడవ డంతో విద్యాధికారులు ఖంగుతిన్నారు.
ప్రైవేటులో అత్యధికం
మేనేజ్‌మెంట్ల వారీగా చూస్తే ప్రైవేటు పాఠ శాలల్లోనే.. గతంలో చెప్పిన లెక్కలకు, ఆన్‌లైన్ లో నమోదైన విద్యార్థుల సంఖ్యలో భారీ తేడా ఉంది. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్‌మెంట్ల పరంగా చూస్తే ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్థల్లోని విద్యార్థుల వివరాలే ఎక్కువగా ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. ఒక్క ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌లో చూస్తే 24,12,084 మంది చదువుతున్నట్లు గతంలో లెక్కలు చూపగా, 22,25,089 మంది విద్యార్థుల వివరాలనే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
ప్రైవేటు యాజ మాన్యంలో 30,48,351 మంది చదువుతున్న లెక్కలు చూపినా, ఆన్‌లైన్‌లో 28,52,895 మంది వివరాలనే యాజమాన్యాలు నమోదు చేశాయి. గుర్తింపు లేని స్కూళ్లలో 19,812 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 14,9986 మంది విద్యార్థులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మదర్సాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 57,321 మంది పిల్లలు ఉన్నట్లు గతేడాది చూపగా, అందులో 17,673 మంది వివారాలే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మిగతా విద్యార్థులు బోగస్ అని విద్యాశాఖ అనుమానం.