నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లకు పోటీ పడే అభ్యర్థులకు ప్రస్తుతమున్న వయసు నిబంధనను సడలించనున్నట్టు
రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లకు పోటీ పడే అభ్యర్థులకు ప్రస్తుతమున్న వయసు నిబంధనను సడలించనున్నట్టు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) వర్గాలు తెలిపాయి. రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణ యం వెలువడే అవకాశముందని అధికార వర్గాలు తెలి పాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్లకు పోటీ పడే అభ్య ర్థులు 17 ఏళ్ల వయసు నిండి.. 24 ఏళ్ల లోపు వారై ఉండా లి. అలాగే 3సార్లు మాత్రమే ఈ అర్హత ప్రవేశ పరీక్ష రాసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వైద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో ఈ నిబంధనలను సడలించాలని ఎంసీఐ నిర్ణయించింది. 17 ఏళ్ల వయసు లేకపోయినా అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశమిస్తే బాగుంటుం దని ఎంసీఐ కమిటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే గరిష్ట వయోపరిమితితో పాటు ఎన్ని సార్లు ఈ అర్హత పరీక్ష రాసుకోవచ్చు అనేది ఇంకా నిర్ణయించలే దని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పీజీ వైద్య విద్య కోసం పోటీ పడే విద్యార్థులకు మాత్రం ఎలాంటి వయసు సడలింపు లేదని ఎంసీఐ వర్గాలు తెలిపాయి.
ఎస్‌హెచ్‌యూఏటీఎస్ చాన్స్‌లర్‌గా జెట్టి
సాక్షి, హైదరాబాద్: సామ్ హిగ్గిన్‌బాటమ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్, టెక్నాలజీ, సైన్సెస్ (ఎస్‌హెచ్‌యూఏటీఎస్) చాన్స్‌లర్‌గా ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ జెట్టి ఎ ఒలీవర్ వరుసగా రెండోసారి ఎంపికయినట్లు యూనివర్సిటీ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ సంబంధిత కోర్సుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా మంచి కోర్సులపై దృష్టి సారించినట్లు జెట్టి తెలిపారు. ఆహార భద్రతకు బయో సైన్స్ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.