వైరల్ వీడియో: ఏడుస్తూనే.. లెట్స్ డూ కుమ్ముడు! | baby singing chiranjeevi song alongwith crying video goes viral | Sakshi
Sakshi News home page

వైరల్ వీడియో: ఏడుస్తూనే.. లెట్స్ డూ కుమ్ముడు!

Published Wed, Mar 8 2017 10:48 AM | Last Updated on Fri, Jul 27 2018 1:25 PM

వైరల్ వీడియో: ఏడుస్తూనే.. లెట్స్ డూ కుమ్ముడు! - Sakshi

వైరల్ వీడియో: ఏడుస్తూనే.. లెట్స్ డూ కుమ్ముడు!

అది ఎక్కడి దృశ్యమో తెలియదు. ఆ పాప ఎవరో కూడా ఎవరూ గుర్తుపట్టలేరు. కానీ, ఆ చిన్నారి వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అతి తక్కువ కాలంలోనే వాట్సప్, ఫేస్‌బుక్‌లతో పాటు యూట్యూబ్‌లో కూడా విపరీతంగా ఫేమస్ అవుతోంది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసిందంటారా.. మంచం మీద ఎవరో ఒక వ్యక్తి పడుకుని, తన పొట్టమీద ఆ చిన్నారిని కూర్చోబెట్టుకున్నారు. ఆయన బహుశా ఆ చిన్నారికి అత్యంత సమీప బంధువు అయి ఉంటారు. ఆ పాప మాత్రం తన తల్లి కోసం ఏడుస్తోంది.

ఆ పాప చేత ఏడుపు మాన్పించడానికి ఆయన 'అమ్మడూ' అనగానే... ఆ చిన్నారి కొంత ఏడుపు కలగలిసిన గొంతుతోనే 'లెట్స్ డూ కుమ్ముడూ' అంటోంది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. అలా ఎన్నిసార్లు అడిగినా ఆ చిన్నారి పాట పాడుతూనే ఉంటోంది. మధ్యలో అమ్మ గుర్తుకొచ్చినప్పుడు మాత్రం మళ్లీ అమ్మ కావాలని ఏడుస్తూ అడుగుతోంది. గ్రీన్ కలర్ గౌను వేసుకుని ఉన్న ఆ చిన్నారి పాటను చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. వాట్సప్ గ్రూపులలో ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement