విలన్‌ది పైచేయిగా ఉండే భాగం అయిపోయింది | Bhatti Vikramarka comments on KCR and Modi | Sakshi
Sakshi News home page

విలన్‌ది పైచేయిగా ఉండే భాగం అయిపోయింది

Published Sun, Mar 19 2017 3:53 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

విలన్‌ది పైచేయిగా ఉండే భాగం అయిపోయింది - Sakshi

విలన్‌ది పైచేయిగా ఉండే భాగం అయిపోయింది

సినిమాలో అంతిమ విజయం హీరోదే: భట్టి
కేసీఆర్, మోదీలను రాహుల్‌ గాంధీ ఓడిస్తారు

సాక్షి, హైదరాబాద్‌: సినిమాల్లో విలన్‌ది పైచేయిగా ఉండే మొదటి భాగం రాష్ట్రంలో అయిపోయిందని, విరామం తర్వాత సినిమా రెండో భాగంలో హీరోదే అంతిమ విజయమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. శనివారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ, రామాయణం, మహా భారతంలోనూ  ఇదే జరిగిందన్నారు.

రామలక్ష్మణులు అరణ్యవాసం చేసి, ఆ తరువాతే రావణున్ని వధించారని గుర్తుచేశారు. మహా భారతంలోనూ పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసిన తర్వాత కౌరవులపై గెలిచారని భట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ను, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్‌ గాంధీ ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని భట్టి విక్రమార్క విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement