తమిళనాడుకు కేబినెట్ సబ్‌కమిటీ | Cabinet subcommittee to Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాడుకు కేబినెట్ సబ్‌కమిటీ

Published Thu, Feb 25 2016 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

తమిళనాడుకు కేబినెట్ సబ్‌కమిటీ

తమిళనాడుకు కేబినెట్ సబ్‌కమిటీ

సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో ఆరోగ్య వ్యవస్థను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర కేబినెట్ సబ్‌కమిటీ గురువారం బయలుదేరింది. ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ పర్యటనకు వెళ్లినట్లు తెలిసింది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం తమిళనాడులోని  కాంచీపురం, తిరుపుక్కజీ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శిస్తారు. శనివారం ట్రిప్లికేన్‌లో 108, 104 సర్వీసుల నిర్వహణ, ఒమండురార్‌లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించడంతో పాటు అక్కడే జరిగే ఆరోగ్య బీమా సదస్సులోనూ పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement