పెళ్లికి రూ.2.5 లక్షలు ఇవ్వలేం..
నగదు లేదని చేతులెత్తేస్తున్న బ్యాంకులు
బోయినపల్లి/కమలాపూర్: గతంలో బిడ్డ.. కొడుకు పెళ్లి చేస్తే.. ఇందుకోసం ఆహ్వాన పత్రికను తొలుత దేవుడి దగ్గర పెట్టి దీవిం చమని కోరుకునేవారు.. నోట్ల రద్దుతో ప్రస్తు తం పత్రికను దేవుడి దగ్గర కాకుండా.. బ్యాంకు అధికారుల ముందు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యాంకులో వివాహ పత్రిక చూపించి రూ.2.50 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చన్న ప్రభుత్వ నిబంధనను అమలు చేసే విషయంలో బ్యాంకులు చేతు లెత్తేస్తున్నారుు. నగదు కొరతతో అంత మొత్తంలో సొమ్ము ఇవ్వలేమని మేనేజర్లు తేల్చి చెబుతుండడంతో బిడ్డల పెళ్లిళ్లు ఎలా చేయాలో తెలియక అనేకమంది ఆందోళన చెందుతున్నారు.
పత్రిక చూపించినా ఇవ్వడం లేదు
సోదరి వివాహం ఉందని బ్యాంకు అధికా రులకు పెళ్లి పత్రిక చూపించినా డబ్బులు ఇవ్వడం లేదని పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంటకు చెందిన పులిపాక రమేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 9న రమేశ్ సోదరి స్వప్ప వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణరుుంచారు. అరుుతే, నోట్ల రద్దు అనంతరం వివాహ పత్రిక చూపించి రూ. 2.50 లక్షల తీసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించిగా.. సోమవారం పత్రిక పట్టుకొని ఎస్‌బీహెచ్‌కు వెళ్లాడు. అరుునా.. బ్యాంకు అధికారులు నగదు లేదని చెప్పి.. వెనక్కి పంపించారు.
నలుగురి ఖాతాల్లో జమచేసి డ్రా..
రాజన్న సిరిసిల్ల జిల్లా బోరుునపల్లి మండలం స్థంబంపల్లికి చెందిన ముచ్చె లింగారెడ్డి కూతురు వివాహం ఈ నెల 8న. పెళ్లి ఖర్చుల నిమిత్తం తన ఖాతా నుంచి తీసుకొనేందుకు బోరుునపల్లి ఆంధ్రాబ్యాంకు వెళ్లాడు. పెళ్లి కార్డు చూపిస్తే అధికారులు రూ.24 వేలు ఇస్తామన్నారు. లక్ష కావాలని వేడుకోగా... ఒప్పుకున్న అధికారులు మెలిక పెట్టారు. ఒక్కరికే లక్ష ఇవ్వడం కుదరదని, రూ.24వేల చొప్పున నలుగురి ఖాతాల్లో జమ చేసుకుని, ఆ తర్వాత డ్రా చేసుకోవాలని చెప్పడంతో, లింగారెడ్డి అదే చేశాడు.
ప్రజావాణిలో వేడుకున్నా..
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కల్కినగర్‌కు చెందిన రాజమణి తన కొడుకు పెళ్లి ఖర్చులకు డబ్బులు ఇప్పించాలని సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణికి వచ్చారు. రాజమణి కుమారుడి వివాహం ఈ నెల 14న ఉంది. ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా బ్యాంకు అధికారులు డబ్బులు ఇవ్వడం లేదని.. ఖాతాలోని డబ్బులు ఇప్పించాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అలాగే, కామారెడ్డి మండలం అడ్లూర్‌కు చెందిన నారాయణపురం గంగయ్య, కామారెడ్డికి చెందిన డి.రాజం, లింగాపూర్‌కు చెందిన బండారు చిన్న భూంరెడ్డి కూడా పెళ్లి పత్రికలు తీసుకుని కలెక్టరేట్‌కు వచ్చారు. వివాహ ఖర్చుల నిమిత్తం బ్యాంకు ఖాతాల్లోని డబ్బును ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు.