ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌కు ఏదైనా జరిగితే
సీపీఐ నేత నారాయణ
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌కు ఏదైనా జరిగితే అందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ హెచ్చరించారు.
కన్హయ్య ఎక్కడికి వెళితే అక్కడ బీజేపీ అనుబంధ విద్యార్ధి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు, సంఘ్‌పరివార్ దాడులు చేయడం పరిపాటైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా మీటింగ్‌లు పెట్టుకునే హక్కుందని, దాడులు, అల్లర్లతో కన్హయ్య నోరు నొక్కాలని చూస్తే బీజేపీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.