భూమి ఉన్నా పంపిణీ ఎందుకు చేయరు? | cpm leader tammineni veerabhadram letter written to cm kcr over land distribution | Sakshi
Sakshi News home page

భూమి ఉన్నా పంపిణీ ఎందుకు చేయరు?

Published Sat, Nov 19 2016 6:50 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

భూమి ఉన్నా పంపిణీ ఎందుకు చేయరు? - Sakshi

భూమి ఉన్నా పంపిణీ ఎందుకు చేయరు?

హైదరాబాద్ : పేదలకు భూ పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులేమిటో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది. ప్రభుత్వ భూమి ఉన్నచోట ముందుగా భూపంపిణీని పూర్తిచేయాలని కోరుతూ ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ మేరకు భూమిలేని ప్రతి దళిత, ఎస్టీ కుటుంబానికి వెంటనే భూ పంపిణీ చేపట్టాలని సూచించింది. గత ప్రభుత్వాల మాదిరిగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కూడా భూపంపిణీపై నిర్దిష్టమైన ప్రణాళిక, చిత్తశుద్ధి లేకపోవడంతో ఈ పథకం ఒక ప్రహసనంగా మారిందని లేఖలో పేర్కొంది. రాష్ట్రంలో మూడు లక్షల దళిత కుటుంబాలకు సాగుభూమి లేదని ఎన్నికలకు ముందు కేసీఆర్ పేర్కొన్నారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా కనీసం ఒక్కశాతం కుటుంబాలకు కూడా భూ పంపిణీ జరగలేదన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement