
'పత్తి రైతుల నోట్లో కేంద్రం మట్టికొడుతోంది'
హైదరాబాద్: తెలంగాణ పత్తి రైతులను కేంద్రం పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పత్తి రైతుల నోట్లో కేంద్రం మట్టికొడుతోందంటూ ఆయన విమర్శించారు. పేదల కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ఒక్క పథకాన్నైనా ప్రవేశపెట్టిందా అని ఈ సందర్భంగా ఈటల ప్రశ్నించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనైనా కేంద్రానికి కనువిప్పు కలగాలని మంత్రి హితవు పలికారు.