ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | Engineering Student jumps off college building, critically injured | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Published Wed, Mar 26 2014 9:25 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం - Sakshi

ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ : ఇంట్లో తల్లిదండ్రుల గొడవ, ఆర్థిక ఇబ్బందులు ... ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థినిని ఆత్మహత్యకు ప్రేరేపించాయి. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. హైదరాబాద్‌ హయత్‌నగర్‌ మండలం గుంటుపల్లిలోని అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్‌ గ్రూపులో బిటెక్ సెకెండ్ ఇయర్ చదువుతున్న సంధ్య మనస్థాపంతో ప్రాణాలు తీసుకోవాలనుకుంది.

బుధవారం ఉదయం కాలేజీలోని అస్త్రా అనే బిల్డింగ్‌పైకి ఎక్కిన ఆమె మూడవ అంతస్థు నుంచి దూకే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన ఆమె స్నేహితులు, వద్దని వారిస్తున్నప్పటికి కిందకు దూకేసింది. వెంటనే సమీపంలోని సన్షైన్ ఆసుపత్రికి తరలించగా ... ప్రస్తుతం చికిత్స పొందుతోంది. సంధ్య .. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement