జిన్నారం: వాయుసేన అకాడమీకి సంబంధించిన నకిలీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను సృష్టించిన ఓ యువకుడు దానిని అధికారులకు చూపించి.. తనను ఇంటర్వ్యూ చేయాలని హల్‌చల్ చేశాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ పాలవెల్లి కథనం మేరకు.. బీహార్ రాష్ట్రం మధుబణి తాలూక లక్నూరం గ్రామానికి చెందిన వినమ్రకుమార్ ఝా జైపూర్‌లో బీటెక్ పూర్తిచేశాడు.
వాయుసేన అకాడమీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పాత నోటిఫికేషన్‌ను నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అనంతరం సంబంధిత అధికారులే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా నకిలీది సృష్టించాడు. దాన్ని పట్టుకొని మెదక్ జిల్లా జిన్నారం సమీపంలోని వాయుసేన అకాడమీకి వచ్చాడు. ‘మీరు ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన ఉద్యోగానికి నేను అర్హుడిని, నన్ను ఇంటర్వ్యూ చేయండి’ అని ఎయిర్‌ఫోర్స్ అధికారులను వినమ్రకుమార్ కోరాడు.
అయితే తాము వాయుసేన విభాగంలో ఎటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయలేదని అధికారులు అతడికి తెలిపారు. అనంతరం ఝా తాను సృష్టించిన నకిలీ పత్రాలను అధికారులకు అందజేశాడు. పరిశీలించి అధికారులు అది నకిలీ నోటిఫికేషన్ అని గుర్తించి ఝూను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎయిర్‌ఫోర్స్ సెక్యూరిటీ అధికారి బాజ్‌పేయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమో దు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
ఉద్యోగం కోసం నకిలీ నోటిఫికేషన్
Published Wed, Aug 6 2014 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement