ఆలస్యంగా వెలుగులోకి విద్యార్థుల ఘర్షణ | fighting between juniors and seniors of layola college | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా వెలుగులోకి విద్యార్థుల ఘర్షణ

Published Thu, Jun 25 2015 9:18 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

ఆలస్యంగా వెలుగులోకి విద్యార్థుల ఘర్షణ

ఆలస్యంగా వెలుగులోకి విద్యార్థుల ఘర్షణ

అల్వాల్: అల్వాల్‌లోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ విద్యార్థులు వారం రోజుల క్రితం రోడ్డుపై సృష్టించిన హంగామా గురువారం మీడియాలో హల్‌చల్ చేసింది. వివరాలలోకి వెళితే... అల్వాల్‌లోని లయోలా కళాశాల విద్యార్థులు వారం రోజుల క్రితం కళాశాల సమీపంలో రోడ్డుపై సీనియర్ విద్యార్థులు కొందరు జూనియర్‌లు తమకు గౌరవం ఇవ్వడంలేదని కొట్టారు. ఈ విషయం తెలిసిన యాజమాన్యం విద్యార్థులను మందలించి చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

కాని ఇరు వర్గాలలో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో విషయం బయటకు రాలేదు. గురువారం మీడియాలో సంఘటన జరిగిన రోజు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను ప్రసారం చేయడంతో పోలీసులులు, విద్యాసంస్థ నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనపై ఆరా తీశారు. ఇదిలా ఉండగా సంఘటన ప్రసారంలో ర్యాగింగ్ అంటూ మీడియా తప్పుడు కథనాలను ప్రసారం చేసిందని విద్యాసంస్థల నిర్వహకులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement