సోమాజిగూడలోని ఓ హోటల్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.
హైదరాబాద్ : సోమాజిగూడలోని ఓ హోటల్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. కత్రియా హోటల్‌లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు.
మరోవైపు హోటల్‌లో బస చేసినవారిని పోలీసులు సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో సుమారు 50మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది.