ఉద్యోగం.. బంగారం అంటూ దగా | frud for job and gold | Sakshi
Sakshi News home page

ఉద్యోగం.. బంగారం అంటూ దగా

Published Sun, Jan 31 2016 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

frud for job and gold

సాక్షి,సిటీబ్యూరో: కోరుకున్న ఉద్యోగం ఇప్పిస్తాం... మా సొసైటీలో సభ్యత్వం తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ధనవంతులను చేస్తాం....ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే రుణమిస్తాం... ఇలా ఎరవేసి హైదరాబాదీలను మోసం చేసిన మూడు కేసుల్లో ఆరుగురు నిందితులను నగర సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీ. ముంబైల్లో అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ ప్రభాకర్‌రావు కథనం ప్రకారం...మీరు కోరుకున్న ఉద్యోగం ఇప్పిస్తామంటూ క్వికర్.కామ్‌లో హారిజాన్ కన్సల్టెన్సీ పేరుతో ఓ ప్రకటన వచ్చింది.  అది చూసి ఏసీ గార్డ్స్‌కు చెందిన మిర్ ఫహద్ అలీ... హారిజాన్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు సందీప్‌కు కాల్ చేశాడు.

కెనడాలోని వైవైసీ కాలగ్రె ఎయిర్‌పోర్టు ఆథారిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని, ఒక్కొక్కరికి రూ.18 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. అలీ తనతో పాటు భార్య, బావమరిదితో కలిపి ముగ్గురికి రూ.54 వేలు అతడిచ్చిన బ్యాంక్ ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత కెనడా వెళ్లేందుకు విమాన టికెట్ల కోసమని రూ.49 వేలు జమ చేయించుకున్నాడు. పార్క్ హయత్ హోటల్‌కు వెళ్తే జన్నీఫర్ అనే మహిళ మీకు ఉద్యోగపత్రాలు ఇస్తుందని చెప్పాడు. అక్కడికి వెళ్లిన అలీకి ఆ పేరుతో ఎవరూ లేరని తెలిసింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ముంబైలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి సయ్యద్ రజాక్ అలియాస్ సందీప్‌ను అరెస్టు చేశారు. రూ.22 వేల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.
 
సొసైటీలో సభ్యత్వమంటూ ...
సీక్రెట్ సొసైటీ ఇల్యూమ్‌నటిలో సభ్యత్వం తీసుకుంటే మీకు బంగారం, డబ్బు వస్తుందని, త్వరగా ధనవంతులు కావచ్చని నైజీరియాకు చెందిన రెమాండ్ హుడ్ బల్క్ పంపిన మెయిల్‌కు మల్లేపల్లికి చెందిన పతాన్ అమీనా బీ స్పందించింది. ఆమెను నమ్మించి హుడ్‌బల్క్ దశలవారీగా రూ.9.63 లక్షలు వివిధ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నాడు.తర్వాత బంగా రు పార్సిల్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ క్లియరెన్స్, ఆర్‌బీఐ క్లియరెన్స్ కోసం ఆగిపోయిందని, డబ్బు పంపమని కోరితే చెల్లించింది.

చివరకు తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది కూడా ముంబై కేంద్రంగా జరిగిన మోసంగా గుర్తించిన పోలీసులు నిందితుల ఖాతా వివరాల ఆధారంగా రేమండ్‌కు సహకరించిన రాజేంద్రకుమార్ వర్మ, అనిల్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు సెల్‌ఫోన్లు, 12 చెక్‌బుక్‌లు, డెబిట్ కార్డు స్వైపింగ్ యంత్రా న్ని స్వాధీనం చేసుకున్నారు
 
లోన్లు ఇప్పిస్తామంటూ బురిడీ...
అబిడ్స్‌కు చెందిన నిషాచల్ నరేంద్ర ప్రసాద్‌కు ఢిల్లీ నుంచి నేహగుప్తా ఫోన్ చేసి యూనియన్ వాల్యూ సర్వీసెస్ పాలసీ తీసుకుంటే మీకు లోన్లు ఇప్పిస్తామని నమ్మించి రూ.45 వేలు తీసుకొని మోసం చేశాడు.  బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసు ఢిల్లీకి వెళ్లారు.  అక్కడ భరత్‌చౌదరి, రమణ్‌దీప్, అంకూర్, అనాస్ అలీ, మునీ త్ ముఖర్జీ, రిహిత్‌కపూర్, ప్రేమ్‌కుమార్ దోవ, గన్‌శ్యామ్‌సింగ్ తదితరులు డల్ ఈజీ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, కేర్ ఇండియా ఫౌండేషన్, యూనియన్ వాల్యూ సర్వీసెస్, మనీక్యాస్ సొల్యూషన్, విన్నర్ 10 ఇంటర్నేషనల్, ఇన్‌ప్రా తదితర పేర్లతో సంస్థలను నడిపిస్తున్నట్టు తెలిసింది.
 
ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అమాయాకులకు ఫోన్‌లు చేసి లోన్లు ఇప్పిస్తామంటూ, ఇన్సూరెన్స్ తీసుకుంటే రుణాలు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఇదే కాల్ సెంటర్ నుంచే అబిడ్స్‌కు చెందిన నరేంద్ర ఫోన్‌కాల్ వచ్చింది. నరేంద్ర డబ్బు డిపాజిట్ చేసి బ్యాంక్ ఖాతాదారులైన అనాస్ అలీ, గన్‌శ్యామ్, ప్రేమ్‌కుమార్‌లను అరెస్టు చేసి, నాలుగు మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెబిట్‌కార్డులు, పాన్‌కార్డులు, చెక్‌బుక్‌లు, రూ.68 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement