జీహెచ్‌ఎంసీలో అటు కార్మికుల సమ్మె.. ఇటు ఇంజినీర్ల నిరసన.. రెండూ ముగిశాయి. శనివారం జీహెచ్‌ఎంసీ అధికారులు రెండు సంఘాల...
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో అటు కార్మికుల సమ్మె.. ఇటు ఇంజినీర్ల నిరసన.. రెండూ ముగిశాయి. శనివారం జీహెచ్‌ఎంసీ అధికారులు రెండు సంఘాల నేతలతో జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు రెండు సంఘాల నేతలు ప్రకటించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను రూ. 16,500కి పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో గురువారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ కార్మికులు శుక్రవారం మధ్యాహ్నానికి సమ్మెను విరమించారు.
జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్, అడిషనల్ కమిషనర్ (ఆరోగ్యం-పారిశుధ్యం) వందన్‌కుమార్.. జనవరి 16లోగా డిమాండ్లను తీరుస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు యు,గోపాల్ ప్రకటించారు. అంతకుముందు.. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించిన కార్మికులనుద్దేశించి జీహెచ్‌ఎంఈయూ నేతలు మాట్లాడారు.
ముగిసిన ఇంజినీర్ల నిరసన
ఇటీవలి జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో తమకు జరిగిన అవ మానానికి నిరసనగా, పెన్‌డౌన్, సామూహిక సెలవులకు దిగిన జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు తమ నిరసన ను ముగించారు. కమిషనర్ సోమేశ్‌కుమార్ శుక్రవా రం ఉదయం తగిన హామీ ఇచ్చారని ఇంజినీరింగ్ అసోసియేషన్ నాయకులు ఎం.ఎ.రహ్మాన్, కె.కిషన్, చెన్నారెడ్డి, ప్రభాకర్ విలేకరులకు తెలిపారు. హామీ అమలు కాకుం టే తిరిగి జనవరి 14 నుంచి కార్యాచరణకు దిగుతామన్నారు. కమిషనర్‌తో చర్చలు జరిపిన వారిలో ఈఎన్‌సీ ధన్‌సింగ్, అసోసియేషన్ నాయకులు ఉన్నారు.