కమిషన్ నిర్ణయాలు వెబ్‌సైట్లో
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఏపీపీఎస్సీ సెప్టెంబర్‌లో నిర్వహించిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ప్రశ్నపత్రంలోని పొరపాట్లకు సంబంధించి అభ్యర్థులకు మార్కులివ్వాలని కమిషన్ నిర్ణయించింది. గ్రూప్-1 ప్రశ్నలపై కమిషన్‌కు అందిన అభ్యంతరాల పరిశీలనకు నియమించిన నిపుణుల కమిటీ నివేదికను అనుసరించి కమిషన్ తీసుకున్న నిర్ణయాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచారు.
► పేపర్-2లోని 9వ ప్రశ్నలో అభ్యర్థులు ఆంధ్రమహాసభ, లేదా ఆంధ్ర మహిళా సభ రెండింటిలో దేనికి సమాధానం రాసినా మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు.
► పేపర్-3లోని 5(ఏ) ప్రశ్నలో ‘రెస్పాన్సిబులిటీ’, ‘రిఫార్మ్స్’ పదాలకు సంబంధించి తప్పుదొర్లింది. దీనికి సంబంధించి అభ్యర్థులు 5 (ఏ), 5 (బీ)లలో దేనికి సమాధానం రాసినా మార్కులివ్వాలని నిర్ణయించారు.
► పేపర్-5లోని 2 (బీ), 3వ ప్రశ్నలు సిలబస్‌కు సంబంధం లేనివిగా గుర్తించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసిన వారికి మార్కులు ఇవ్వనున్నారు.
► పేపర్-5లో 8 (ఏ)(2) ప్రశ్న, 8 (బీ)(3) ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. వీటిని తొలగించి మిగతా ప్రశ్నలకు ఆ విభాగంలోని పూర్తిమార్కులను పరిగణనలోకి తీసుకొని మూల్యాంకనం చేయనున్నారు.
► పేపర్-5లో 9 (ఏ)(1), 9(ఏ)(3), 9(ఏ) (5) ప్రశ్నలు తప్పుగా గుర్తించారు. ఈ విభాగంలోని 9వ ప్రశ్నకు సమాధానం రాసినవారందరికీ మార్కులు ఇవ్వనున్నారు.
► పేపర్-5లో 10(ఏ)(2) ప్రశ్నకూడా తప్పుగా వచ్చింది. 10 విభాగం ప్రశ్నకు సమాధానం రాసిన వారికి పూర్తిమార్కులు ఇవ్వనున్నారు.
► సిలబస్‌కు లోబడే ఉన్నందున కరెంట్ ఈవెంట్స్ ప్రశ్నలకు సంబంధించిన అభ్యంతరాలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదు.
గ్రూప్-1లో పొరపాటు ప్రశ్నలకు మార్కులు
Published Sun, Nov 6 2016 3:01 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement