హాజరుకానున్న 8,782 మంది అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 గ్రూపు-1 మెయిన్స్ రీ ఎగ్జామ్‌ను ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహిం చేందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని 17 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు 8,782 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది.
పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. అభ్యర్థులను ఉదయం 8:30 గంటల నుంచి 9:15 వరకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్ డేటా, ఫొటో, వేలిముద్రలు సేకరిస్తారు కనుక ఉదయం 9:15 లోపే పరీక్ష హాల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు.
నేటి నుంచి 2011 గ్రూపు-1 మెయిన్స్
Published Wed, Sep 14 2016 2:52 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement