రెచ్చిపోయిన మృగాళ్లు... | Harassment of women in public places in hyderabad | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన మృగాళ్లు...

Published Sat, Dec 6 2014 12:56 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

రెచ్చిపోయిన మృగాళ్లు... - Sakshi

రెచ్చిపోయిన మృగాళ్లు...

నగరంలో మృగాళ్లు రెచ్చిపోయారు. ఎర్రగడ్డలో ఓ యువకుడు మహిళపై లైంగికదాడికి యత్నించాడు. హయత్‌నగర్ ఠాణా పరిధిలో మరో కామాంధుడు వివాహితను ప్రేమించమని వేధించాడు. నల్లకుంటలో రోడ్డు దాటుతున్న యువతితోను, అమీర్‌పేటలో కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌కు వెళ్తున్న విద్యార్థినితోనూ ఇద్దరు అసభ్యంగా ప్రవర్తించారు.  అడ్డగుట్టలో పెళ్లి చేసుకుంటానని యువతిని యువకుడు వంచించాడు.

 
 లైంగికదాడికి యత్నం.. దాడి

 అమీర్‌పేట: మహిళపై లైంగికదాడికి యత్నించిన  యువకుడిని సనత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ హరిశ్ఛంద్రారెడ్డి కథనం ప్రకారం...  ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన ఆత్మారావు గురువారం రాత్రి అతిగామద్యం తాగి స్థానికంగా ఉండే 40 ఏళ్ల  మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెపై లైంగికదాడికి యత్నించగా ఎదురు తిరిగింది. దీంతో ఆమె తలపై కర్రతో బలంగా కొట్టడంతో రక్తస్రావమై స్పృహతప్పి పడిపోయింది.  

అడ్డువచ్చిన ఆమె సోదరినికూడా తీవ్రంగా కొట్టిన ఆత్మారావు బస్తీపెద్దలను సైతం దుర్భాషలాడాడు. అదేరాత్రి నేరుగావచ్చి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బస్తీవాసులు తనను కోట్టారంటూ తప్పుడు ఫిర్యాదుచేశాడు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు విచారణ జరిపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం కేసు నమోదుచేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.
 
 పెళ్లి చేసుకుంటానని మోసం...
అడ్డగుట్ట: ప్రేమిస్తున్నా... పెళ్లి చేసుకుంటా అని యువతికి మాయమాటలు చెప్పి గర్భవతిని చేసి తర్వాత ముఖం చాటేశాడో ప్రబుద్ధుడు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం తుకారాంగేట్ పోలీసులను ఆశ్రయించింది. ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం... అడ్డగుట్ట వెంకట్‌నగర్‌కు చెందిన శౌర్వన్ కుమార్(25) కారుడ్రైవర్. ఇతనికి ముందే వేరే అమ్మాయితో వివాహం జరిగింది. ఒక పాప కూడా ఉంది.  ఇదిలా ఉండగా.. ఇతడికి  పది నెలల క్రితం రసూల్‌పురాకు చెందిన యువతి (18)తో పరిచయం ఏర్పడింది.

అయితే, తనకు పెళ్లి కాలేదని, నిన్ను ప్రేమిస్తున్నా.. అని ఆ యువతికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు.  ఈ నేపథ్యంలో యువతి గర్భందాల్చింది. విషయాన్ని కుమార్‌కు చెప్పగా.. అప్పటి నుంచి అతనిలో ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఫోన్ చేసినా స్పందించడంలేదు. అనుమానం వచ్చిన యువతి పెళ్లి విషయమై కుమార్‌ను నేరుగా ప్రశ్నించగా... నీకూ నాకూ సంబంధంలేదని, నావల్లే గర్భవం వచ్చిందనటానికి గ్యారంటీ ఏంటని తిట్టి పంపేశాడు. దీంతో కుమార్ గురించి వాకబు చేయగా...  ఇంతకుముందే అతడికి పెళ్లైందని తెలిసింది. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ తుకారాంగేట్ పోలీసులకు లిఖిత పూర్వకరంగా ఫిర్యాదు చేసింది.  పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 
 ప్రేమించాలని ...
 హయత్‌నగర్: వివాహితను ప్రేమించమని వేధిస్తున్న ఓ యువకుడిపై శుక్రవారం హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ముదిరాజ్‌కాలనీకి చెందినయువతి (23) స్థానిక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. సాయినగర్‌కాలనీకి చెందిన అశోక్ అనే యువకుడు కొంత కాలంగా యువతిని ప్రేమించమని వేధించసాగాడు. ఆమెకు వివాహం జరిగినా అశోక్ తన ప్రవర్తనను మార్చుకోలేదు. పలుమార్లు ఆమె మందలించినా వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నాడు. పైగా యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు.  బాధితురాలి తండ్రి శుక్రవారం హయత్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 విద్యార్థినికి వేధింపులు...
పంజగుట్ట: విద్యార్థిని వేధిస్తున్న యువకుడిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... ఆనంద్‌నగర్ కాలనీలో నివసించే యువతి ప్రతి రోజు ఉదయం 6.30కి అమీర్‌పేటలోని కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌కు వెళ్తోంది. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే కోచింగ్ సెంటర్‌కు వెళ్తుండగా ఆర్టీఏ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న శివకుమార్ అనే యువకుడు బస్‌స్టాప్‌లో ఆమె చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత విద్యార్థిని తన ఇంటికి వెళ్లి విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పగా.. సోదరుడు భరత్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసిన పోలీసులు శివకుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 
యువతితో అసభ్య ప్రవర్తన
నల్లకుంట: రోడ్డు దాటుతున్న యువతి చాతీపై చేయి వేసి ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు యువకుడిని నల్లకుంట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎస్సై చిరంజీవి కథ నం ప్రకారం... నల్లకుంట పాతరామాలయం ప్రాంతంలో ఉండే యువతి (23) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. శుక్రవారం సాయంత్రం ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా...అదే సమయంలో అటుగా వచ్చిన పాతబస్తీ డబీల్‌పురకు  చెందిన సయ్యద్ జబ్బార్ (23) ఆమె చాతీకి చేయి తాకించాడు. దీంతో ఆమె అతడి ని నిలదీయగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు జబ్బార్‌ను ఠాణాకు తరలించి విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement