నగరంలోని కూకట్‌పల్లి వద్దగల 9వ నంబరు జాతీయ రహదారిలో సోమవారం మధ్యాహ్నం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
- ప్రయాణికుల ఇక్కట్లు
హైదరాబాద్ సిటీ
నగరంలోని కూకట్‌పల్లి వద్దగల 9వ నంబరు జాతీయ రహదారిలో సోమవారం మధ్యాహ్నం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కేపీహెచ్‌బీ వద్ద రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో వాహనాలు వెళ్లడానికి ఇబ్బంది కలుగుతోంది. దాంతో ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయింది. గంటల తరబడి వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందిపడుతున్నారు. సన్నగా జల్లులు పడుతుండడంతో ద్విచక్రవాహనదారులు తడిసి ముద్దవుతున్నారు. ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి గంట సమయం పడుతోంది.