రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నందున నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హైఅలర్ట్ ప్రకటించారు.
- మంత్రి హరీశ్ ప్రత్యేక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నందున నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హైఅలర్ట్ ప్రకటించారు. అధికారులంతా అప్రమత్తం గా ఉండాలని ఆదివారం ప్రత్యేక ఆదేశాలిచ్చారు. సీఈలు, ఎస్‌ఈలు అంతా ప్రాజెక్టు హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నీటి ప్రవాహ ఉధృతిని ఎప్పటికప్పుడు వాట్సప్ గ్రూపుల్లో అప్‌డేట్ చేయాలని, రెవెన్యూ, పోలీసు శాఖలతో సమన్వయం చేసు కుంటూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో చాలా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండుతున్నాయని, పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉన్నా అధికారులు అందుబాటులో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎల్లంపల్లి, జూరాల ప్రాజెక్టుల్లో వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉందని, సీనియర్ అధికారులంతా అందుబాటులో ఉండి, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు.