జాతీయ రహదారిపై భారీ గుంత | hole in road | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై భారీ గుంత

Published Wed, Nov 23 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

జాతీయ రహదారిపై భారీ గుంత

జాతీయ రహదారిపై భారీ గుంత

 
భాగ్యనగర్‌కాలనీ: నిత్యం రద్దీగా ఉండే ఉషా ముళ్లపూడి చౌరస్తాలోని జాతీయ రహదారిపై భారీ గుంత ఏర్పడింది. దీంతో వాహనాల రాకపోకలకు త్రీవ అంతరాయం కలిగింది. నాణ్యత కొరవడిన కారణంగా తరచూ రోడ్లు కుంగిపోయి గుంతలు పడుతున్నాయి.  ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో అని భయాందోళనతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నెక్లెస్‌ రోడ్డులో పడిన భారీ గుంత సంఘటన మరవక ముందే ఇక్కడి జాతీయ రహదారిపై గుంత ఏర్పడటంపై ఇటు అధికారులను, వాహనదారులను కలవరానికి గురి చేస్తోంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై గుంత ఏర్పడిన సమయంలో వాహనాలు రద్దీ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. 
     గుంత ఏర్పడిన విషయం తెలుసుకున్న వాటర్‌వర్కు, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. గుంత ఏర్పడటానికి గల కారణాలు తెలుసుకున్నారు. గతంలో ఉషాముళ్లపూడి నుంచి కేపీహెచ్‌బీకాలనీ వైపు గోదావరి ప్రధాన పైపులై వేశారు. పైపులై లీకేజీ కారణంగానే గుంత ఏర్పడి ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా జాతీయ రహదారికి రెండు వైపులా నీటి లీకేజీతో అడుగు భాగం నానిపోయి గుంత పడింది. సంబంధిత అధికారులు పొక్లెయితో మరమ్మతుల చేపట్టేందుకు చర్యలకు ఉపక్రమించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement