
మా డబ్బుతో నీ బోర్డులు పెడతావా?
నీకెంత ధైర్యం? మేము డబ్బులిస్తుంటే నీ కంపెనీ పనిచేస్తోందా, నువ్వు డబ్బులిస్తోంటే మేము పనిచేస్తున్నామా? ఏడాదికి రూ.120 కోట్లు ఇస్తున్నాం. మా ఆస్పత్రుల్లో నువ్వు బోర్డులు పెడతావా అంటూ సదరు శాఖకు చెందిన మంత్రి మొన్నామధ్య చీరాల పర్యటనలో తీవ్రంగా మండిపడ్డారట. ఎన్ని కోట్లు ఖర్చు చేసి పథకాలు పెట్టినా ప్రభుత్వానికి పేరు రావట్లేదని ఆయన ఆవేదన చెందారట. ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కడైనా ప్రైవేటు సంస్థల బోర్డులు చూశారా అంటూ ఆస్పత్రి సిబ్బందిని గద్దించారు.
వెంటనే ప్రైవేటు సంస్థ సీఈఓకు ఫోన్ కలిపి నీ ఇష్టమొచ్చినట్టు చేస్తే కుదరదు. నీమీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. నీకెంత ధైర్యం లేకపోతే మా ఆస్పత్రిలో నీ బోర్డు పెట్టి కూర్చుంటావా అంటూ చిందులేశారుట. అంతేకాదు తాను చెప్పినవేవీ అమలు కావడం లేదని, ఉన్నతాధికారుల నుంచీ, కిందిస్థాయి సిబ్బంది వరకూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. అనంతరం మంత్రి కోపం మామూలే కదా...ఒక్క రోజు ఆస్పత్రిలో నిద్ర చేస్తే ఆ కోపం మాయమవుతుందిలే అంటూ ఆస్పత్రి సిబ్బంది గుసగుసలాడుకున్నారుట.