
అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
మిషన్ కాకతీయ, భగీరథ పథకాలపై హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలపై హైదరాబాద్‌లో ఈ నెల 12న సదస్సు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడంపై నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకాలను ఆదర్శంగా తీసుకుని అమలు చేయాలని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాలను నీతిఆయోగ్, కేంద్రం పలుమార్లు కొనియాడాయని తెలిపారు. మిషన్ కాకతీయను అన్ని రాష్ట్రాలు నమూనాగా తీసుకోవడానికి కేంద్రం చర్యలు చేపట్టడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు.