⇒ హైకోర్టులో పిల్ దాఖలు.. విచారణ నేటికి వాయిదా
⇒ పూర్తి వివరాలు ముందుంచాలని ప్రభుత్వానికి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. దీనిపై మంగళ వారం విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివ రాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, వీటిని అధికారులు పట్టించుకోవడం లేదని, ఎన్‌సీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు కేటాయించకుండానే నియా మకాలు జరిపారంటూ రంగారెడ్డి జిల్లాకు చెం దిన శ్రీనివాస్‌గౌడ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశా రు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, ఎన్‌సీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు నిర్ణ యించలేదన్నారు. అలాగే, తక్కువ మార్కులొ చ్చిన హోంగార్డులను ఎంపిక చేశారని, జనరల్ కేటగిరీ అభ్యర్థుల కన్నా ఎక్కువ మార్కులొచ్చిన ఎన్‌సీసీ వారిని పట్టించుకోలేదన్నారు.
కానిస్టేబుల్ నియామకాల్లో అక్రమాలు
Published Wed, Mar 8 2017 4:10 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement